Gas Leak: మహారాష్ట్రలోని రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్.. 34 మందికి ఆస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

మంగళవారం ఉదయం మహారాష్ట్రలోని థానే జిల్లాలోని అంబర్‌నాథ్ పట్టణంలోని ఒక పారిశ్రామిక యూనిట్‎లో రసాయన వాయువులు లీకయ్యాయి. రసాయన వాయువుల లీకుతో 34 మంది అస్వస్థతకు గురైనట్లు ఒక అధికారి తెలిపారు...

Gas Leak: మహారాష్ట్రలోని రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్.. 34 మందికి ఆస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
Gas Leak

Updated on: Oct 12, 2021 | 8:37 PM

మంగళవారం ఉదయం మహారాష్ట్రలోని థానే జిల్లాలోని అంబర్‌నాథ్ పట్టణంలోని ఒక పారిశ్రామిక యూనిట్‎లో రసాయన వాయువులు లీకయ్యాయి. రసాయన వాయువుల లీకుతో 34 మంది అస్వస్థతకు గురైనట్లు ఒక అధికారి తెలిపారు. లీకేజీ తరువాత రసాయన కర్మాగారం సమీపంలో నివసించే అనేక మంది ప్రజలు శ్వాసకోస ఇబ్బింది, కళ్లలో మంటలు, వికారం, ఇతర ఆరోగ్య సమస్యలతో తమకు ఫిర్యాదు చేసినట్లు థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ సంతోష్ కదమ్ తెలిపారు.

అంబర్‌నాథ్‌లోని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MIDC) లో ఉన్న యూనిట్‌లో ఉదయం 10 గంటల సమయంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ లీక్ అయినట్లు ఆయన చెప్పారు. తరువాత ఊపిరాడకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలతో 34 మందిని ఉల్లాస్‌నగర్‌లోని సెంట్రల్ హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ఎలాంటి హాని లేనట్లు చెప్పారు. గ్యాస్ లీకేజీ తర్వాత అప్రమత్తమైన స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని లీకేజీని సమస్యను పరిష్కరించారు. వాయువు ఎలా లీక్ అయిందో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత కాకుండా చూస్తామని తెలిపారు.

గతంలో కూడా చాలా సందర్భాల్లో రసాయనిక పరిశ్రమల్లో గ్యాసి లీకైన ఘటనలు ఉన్నాయి. ఇందులో అత్యంత పెద్ద ప్రమాదంగా భోపాల్ గ్యాస్ లీకేజీ ఘటన చూడొచ్చు. గత సంవత్సరం ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఎల్జీ పాలిమర్స్‎లో గ్యాసి లీకైన విషయం తెలిసిందే. అందుకే పరిశ్రమలు ఉన్న చోట నివాస గృహలు ఉండొద్దని నిపుణులు చెబుతున్నారు.

Read Also..  Ministry of Civil Aviation: గుడ్‎న్యూస్.. అక్టోబర్ 18 నుంచి ఆంక్షలు లేని విమాన ప్రయాణం.. అనుమతి ఇచ్చిన విమానయాన మంత్రిత్వ శాఖ..