Omicron Variant: భారత్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. 1007కి చేరిన కేసులు.. ఇక తెలంగాణలో ఎన్ని కేసులంటే..!

|

Dec 30, 2021 | 8:32 PM

Omicron Variant: ఇక భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో ఒమిక్రాన్‌ కేసులు వెయ్యి దాటేశాయి. భారత్‌లో ఇప్పటి వరకు 1007 కేసులు నమోదైనట్లు..

Omicron Variant: భారత్‌లో విజృంభిస్తున్న ఒమిక్రాన్‌.. 1007కి చేరిన కేసులు.. ఇక తెలంగాణలో ఎన్ని కేసులంటే..!
Follow us on

Omicron Variant: ఇక భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో ఒమిక్రాన్‌ కేసులు వెయ్యి దాటేశాయి. భారత్‌లో ఇప్పటి వరకు 1007 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యా ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ఒక్క రోజే 31 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. హర్యానాలో కొత్తగా 23, అసోంలో 3 కేసులు, తెలంగాణలో 5 కేసుల చొప్పున నమోదయ్యాయి.

దేశంలోరోజురోజుకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరిస్తుండటంతో ఆందోళన నెలకొంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న జనాలకు ఈ కొత్త వేరియంట్‌ మరింత కలవర పెడుతోంది. మళ్లీ ఎక్కడ లాక్‌డౌన్‌ పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త వేరియంట్‌ రోజురోజుకు విజృంభిస్తుండటంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నాయి. ఇక కొత్త సంవత్సరం వేడుకలు ఉండటంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

ఈ కొత్త వేరియంట్‌ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్‌లకు లేఖలు రాసింది. కోవిడ్-19 కేసులను అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ను పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతోపాటు కరోనా పరీక్షలు, ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచడం, ట్రేసింగ్‌, కంటైన్మెంట్‌ జోన్లపై దృష్టిసారించాలని లేఖలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

Omicron: కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. చర్యలు తీసుకోండి: 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Covid Vaccine: నాలుగు డోసులు తీసుకున్నా.. కరోనా మహమ్మారి సోకింది..! అక్కడినుంచి వచ్చిన మహిళకు..