కోల్ కతా లో ముగ్గురు జమాతుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల అరెస్ట్.. జిహాదీ సాహిత్యం స్వాధీనం

| Edited By: Phani CH

Jul 11, 2021 | 10:04 PM

నిషిద్ధ జమాతుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను కోల్ కతా లో పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు...

కోల్ కతా లో ముగ్గురు జమాతుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల అరెస్ట్.. జిహాదీ సాహిత్యం స్వాధీనం
3 Terrorists Arrest
Follow us on

నిషిద్ధ జమాతుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను కోల్ కతా లో పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి జిహాదీ సాహిత్యాన్ని, అనుమానాస్పద పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, ముఖ్యంగా ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య సభ్యుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లతో కూడిన లిఖిత పూర్వక డైరీ కూడా వీటిలో ఉందని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు చెందిన పోలీసులు వెల్లడించారు. వీరు నగరంలో మధ్యతరగతివారు ఎక్కువగా నివసించే ఇళ్ల కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారని ఖాకీలు చెప్పారు. సుమారు రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నా వీరిపై ఎవరికీ అనుమానం రాలేదంటే ఎంత పకడ్బందీగా తన కార్యకలాపాలు కొనసాగించేవారో అర్థమవుతోందన్నారు. వీరు టెర్రరిస్టులని ఏ మాత్రం ఎవరూ పసిగట్టలేకపోయారన్నారు. ప్రస్తుతం వీరిని ఇంటరాగేట్ చేస్తున్నామని, రేపు కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.

అటు యూపీ రాజధాని లక్నోలో కూడా ఆదివారం ఉదయం ఇద్దరు టెర్రరిస్టులను పోలీసులు అరెస్టు చేసిన విషయం గమనార్హం. సరిహద్దుల్లోని కొందరు వ్యక్తులతో వీరికి లింకులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. వీరిని కూడా కోర్టులో హాజరు పరచనున్నారు. దేశంలో ఇటీవల ఢిల్లీలో చైనాకు చెందిన ఓ వ్యక్తి కొన్ని నెలలుగా బాహాటంగానే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా అతడిని అనుమానించలేకపోయారు. అయితే సిమ్ కార్డులను ఉపయోగిస్తూ అతడు కొన్ని వందలమందిని ప్రత్యేక స్కీముల పేరిట మోసగించిన విషయం తెలిసిందే. చివరకు అతడిని, అతని భార్యను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ఇలా ఉగ్రవాదులు, విదేశీ నేరగాళ్లు బరి తెగిస్తున్న వైనం పోలీసులనే ఆశ్చర్యపరుస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Cloud Waterfall: జలపాతంలా జాలువారే మేఘాలు..అద్భుత దృశ్యం .. ఎక్కడంటే..?? ( వీడియో )

CM Stalin – Vijayakanth: హీరో విజయకాంత్‌‌కు ఊహించని షాక్.. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లిన సీఎం