Ganges River: పవిత్ర గంగానదిలో పాపపు పనులు.. చికెన్‌, హుక్కాతో జల్సా.. షాకింగ్‌ వీడియో

పడవపై కూర్చున్న కొందరు యువకులు హుక్కా తాగుతుండగా, మరికొందరు చికెన్ వండుతున్నారు. వెనుక కూర్చున్న యువకులు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. బోటులో యువకులు ఎంతో జాలీగా సెల్ఫీలు దిగుతున్నారు.

Ganges River: పవిత్ర గంగానదిలో పాపపు పనులు.. చికెన్‌, హుక్కాతో జల్సా.. షాకింగ్‌ వీడియో
Boat In Ganga River

Updated on: Sep 01, 2022 | 3:27 PM

Ganges River: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరాన్ని ధర్మనగరి అంటారు. అయితే, అలాంటి ప్రదేశంలో ప్రవహిస్తున్న గంగా నదిలో పడవపై కూర్చొని కొందరు వ్యక్తులు హుక్కా తాగుతూ మాంసం తింటున్న వీడియో వైరల్ అవుతోంది. అదే విషయమై పోలీసులు ఇప్పుడు విచారణ ప్రారంభించారు. వైరల్ వీడియోలో, కొంతమంది యువకులు గంగా నదిలో పడవలో కూర్చుని వెళ్తూ..మద్యం, హుక్కా,చికెన్‌తో పార్టీ చేసుకుంటున్నారు. ఈ వీడియోను ఓ యువకుడు తన మొబైల్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో చేరింది. దాంతో వీడియో వైరల్ కావడంతో దారాగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో ఈ వీడియో దరగంజ్‌కి చెందినదని తేలితే నిందితుడిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

పడవపై కూర్చున్న కొందరు యువకులు హుక్కా తాగుతుండగా, మరికొందరు చికెన్ వండుతున్నారు. వెనుక కూర్చున్న యువకులు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. బోటులో యువకులు ఎంతో జాలీగా సెల్ఫీలు దిగుతున్నారు.

ఇవి కూడా చదవండి

గంగానదిలో పడవపై పార్టీ చేసుకున్న ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజలు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయమై దారాగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ కేసులో వీడియో ఆధారంగా యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి