Tihar Jail: పెరోల్ పై బయటకు.. ఏడాదిన్నర అయినా తిరిగి రాలేదు.. తిహార్ జైలులో కలకలం

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిహార్ జైలు (Tihar Jail) లోని ఖైదీల ఆరోగ్య భద్రత కోసం వారిని పెరోల్‌పై బయటకు పంపించారు. ఇలా పెరోల్‌పై బయటకు వెళ్లిన ఖైదీల్లో 2,400 మంది తిరిగి రాలేదని అధికారులు...

Tihar Jail: పెరోల్ పై బయటకు.. ఏడాదిన్నర అయినా తిరిగి రాలేదు.. తిహార్ జైలులో కలకలం
Tihar

Updated on: Mar 19, 2022 | 6:17 PM

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిహార్ జైలు (Tihar Jail) లోని ఖైదీల ఆరోగ్య భద్రత కోసం వారిని పెరోల్‌పై బయటకు పంపించారు. ఇలా పెరోల్‌పై బయటకు వెళ్లిన ఖైదీల్లో 2,400 మంది తిరిగి రాలేదని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మిస్సింగ్ (Missing) అయిన ఖైదీల జాబితాను జైలు అధికారులు విడుదల చేశారు. 2020-21 మధ్య కొవిడ్-19 వ్యాప్తి సమయంలో 6,000 మంది ఖైదీలకు పెరోల్(Parole) మంజూరు చేశారు. వారిలో 3,400 మంది మాత్రమే తిరిగొచ్చారు. ఏడాదిన్నరగా పరారీలో ఉన్న మిగతావారి ఆచూకీ తెలిపిన వారికి బహుమానం ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. పెరోల్‌పై బయటకు వెళ్లినవారిలో చాలా మంది పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. బయట వచ్చిన తర్వాత వీరిలో ఎవరైనా అనారోగ్యంతో చనిపోయారా? అని అధికారులు అనుమానిస్తున్నారు. వారి కుటుంబసభ్యులను సంప్రదించిన తర్వాత ఏమయ్యారనేది ధ్రువీకరిస్తామని తెలిపారు.

కరోనా రెండో దశ ఉద్ధృతిలోనూ మరో 5,000 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు చేసినట్లు సమాచారం. వాళ్లు కూడా ఇంకా సరెండర్ కావాల్సి ఉంది. దేశంలో కరోనా మొదలైన తర్వాత తిహార్ జైలులో వైరస్ పంజా విసిరింది. వెయ్యి మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 521మంది ఖైదీలు, 534 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో 6,000 మందికి పెరోల్ మంజూరు చేసి బయటకు పంపించారు. కరోనా సయమంలో తిహార్ జైలులో 10 మంది మరణించారు.

మరోవైపు.. దేశంలో రోజువారీ కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 2,075 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. శుక్రవారంతో పోల్చితే నేటికి మరణాలు సగానికి పైగా తగ్గాయి. కొత్తగా మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,383 మంది వైరస్​నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.73 శాతంగా ఉండగా.. పాజిటివిటీ రేటు 0.56 శాతంగా ఉంది.

Also Read

Summer Health Tips: జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా? అయితే, ఇలా చేయండి..!

Puneeth Rajkumar: పునీత్ పుట్టిన రోజున నీ స్మృతిలో అంటూ అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హీరో విశాల్.. వీడియో వైరల్

Heartland Virus: కలవరపెడుతోన్న కొత్త వైరస్‌.. నల్లుల నుంచి వేగంగా వ్యాప్తి.. వారికే ముప్పంటున్న వైద్య నిపుణులు..