Special Train Services Extended: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం ఇప్పుడిప్పుడే.. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజుల క్రితం నాలుగు లక్షల వరకు నమోదైన కరోనా కేసులు కాస్త.. ఇప్పడు 60వేల వరకు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తెయగా.. మరికొన్ని సాదారణ కర్ఫ్యూను కొనసాగిస్తున్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఇటీవల పలు రైళ్ల సర్వీసులను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా మరికొన్ని సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 24 ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.
ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఈ 24 సర్వీసులు తదుపరి ఆదేశాలు వచ్చేదాకా కొనసాగుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. ఆయా రైళ్లన్నీ పూర్తిగా రిజర్వుడు సర్వీసులేనని ప్రజా సంబంధాల ముఖ్య అధికారి సీహెచ్ రాకేశ్ స్పష్టంచేశారు. వీటిలో 6 రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగించనున్నాయి. మరో 16 రైళ్లు వారంలో ఒకసారి, రెండు రైళ్లు వారంలో రెండు సార్లు సేవలను అందించనున్నాయి. రైళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
రైళ్ల వివరాలు
Also Read: