Viral: ఇంటి నుంచి బీరువా తరలిస్తుండగా కింద కనిపించిన కన్నం.. దాని లోపల కుప్పలు తెప్పలుగా..

తమిళనాడు పల్లందురై లూర్దేస్‌ కాలనీలో రీగన్ అనే మత్స్యకారుడు నివాసం ఉంటున్నాడు. అతను తన పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో పాత ఇంటిలోని సామాన్లను వేరే చోటికి తరలించాలనుకున్నాడు. ఈ క్రమంలో కొంతమంది కార్మికులను పురమాయించాడు. వారు ఓ బీరువాని తరలిస్తుండగా....

Viral: ఇంటి నుంచి బీరువా తరలిస్తుండగా కింద కనిపించిన కన్నం.. దాని లోపల కుప్పలు తెప్పలుగా..
Baby Snakes

Updated on: Apr 27, 2025 | 4:02 PM

తమిళనాడు కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌… మేలకృష్ణన్‌పుత్తూర్ సమీపంలోని పల్లంతురై లౌర్దేస్ కాలనీలో రేగన్ అనే జాలరికి ఒక ఇల్లు ఉంది. అది శిథిలావస్థకు చేరడంతో కొత్త ఇల్లు నిర్మించాలనుకున్నాడు. ఈ క్రమంలో ఏడాది క్రితం వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ నివాసం ఉంటున్నాడు. కొత్త ఇంటి నిర్మాణం కోసం పాత ఇంటిని కూల్చివేయాలని రేగన్ భావించాడు. ఈ క్రమంలో అక్కడే ఉంచిన కొన్ని వస్తువులను అద్దె ఇంటికి తరలించాలనుకున్నాడు. అందులో భాగంగా.. పాత ఇంట్లోని ఓ గదిలో ఉన్న బీరువా కదిలిస్తుండగా.. దాని కింద నుంచి పెద్ద తాచుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో కార్మికులు షాక్‌కు గురై పరుగులు తీశారు. మనుషుల శబ్దాలు వినడంతో పాము అక్కడి నుంచి వడివడిగా వెళ్లిపోయింది.

కొద్దిసేపటి తర్వాత కార్మికులు లోపలికి వెళ్లి బీరువాను తొలగించారు. ఆ సమయంలో బీరువా కింద కనిపించినవి చూసి మరోసారి కంగుతిన్నారు. ఓ కన్నంలో కుప్పులు తెప్పలుగా మెలికలు తిరుగుతున్న పాము పిల్లలు కనిపించాయి. కొన్ని పాము గుడ్లు కూడా పడి ఉన్నాయి. దీంతో వారు పాములు పట్టే సుందరదాస్‌కు సమాచారం అందించారు. అతను వచ్చి ఆ కన్నం నుంచి  24  పాము పిల్లలు, 7 పాము గుడ్లు బయటకు తీశాడు. కొన్ని గుడ్లను ముట్టగానే, వాటి నుంచి పాము పిల్లలు బయటకు రావడం ప్రారంభించాయి. అనంతరం సుందరదాస్‌ పాము పిల్లలను, గుడ్లను సంచిలో వేసి వడచేరిలోని ఫారెస్ట్ ఆఫీసులో అప్పగించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..