హిజాబ్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. కర్నాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉప్పినగండి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీ యాజమాన్యం హిజాబ్ ధరించి వచ్చిన 23మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది..తరగతి గదిలో హిజాబ్ ధరించాలని అనుమతించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన 23 మంది విద్యార్థినులను సస్పెండ్ చేసింది. కాలేజీకి హిజాబ్ వేసుకొచ్చారని 23 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కొన్ని నెలల క్రితం హిజాబ్ వివాదం కారణంగా పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు యూనిఫార్మ్ తప్పనిసరి చేశారు. అయినప్పటికీ కొందరు విద్యార్థులు యూనిఫాంలో కాకుండా హిజాబ్‌లో వస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి 23 మంది విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చారు. వారు హిజాబ్ తీయకుండా తరగతులకు హాజరుకాబోమని తెలిపారు. దాంతో వారిని వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.
ఈ ఏడాది మార్చిలో కర్ణాటక హైకోర్టు ఇస్లాం మతంలో కండువా తప్పనిసరి కాదని, విద్యాసంస్థల్లో దుస్తులు ఉన్న చోట అందరూ ఏకరీతి దుస్తుల నిబంధనను పాటించాలని ఈ ఏడాది మార్చిలో తీర్పునిచ్చింది. విద్యాసంస్థల్లో హిజాబ్ లు, కాషాయ కండువాలు ధరించకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిప్పటికీ బాలికలు హిజాబ్ ధరించాలని పట్టుబట్టారు.