Godhra Train Coach Burning Case: గోద్రా రైలు దహనం కేసు… 19 ఏళ్లకు పట్టుబడిన ప్రధాన నిందితుడు

|

Feb 16, 2021 | 1:19 PM

Godhra Train Coach Burning Case: గుజరాత్‌లోని పంచ్‌మహల్‌ జిల్లాలో గోద్రా రైల్వే స్ట్రేషన్‌ వద్ద సుమారు 19 ఏళ్ల కిందట కరసేవకుల సజీవ దహనం చేసిన ఘటనలో ప్రధాని ...

Godhra Train Coach Burning Case: గోద్రా రైలు దహనం కేసు... 19 ఏళ్లకు పట్టుబడిన ప్రధాన నిందితుడు
Follow us on

Godhra Train Coach Burning Case: గుజరాత్‌లోని పంచ్‌మహల్‌ జిల్లాలో గోద్రా రైల్వే స్ట్రేషన్‌ వద్ద సుమారు 19 ఏళ్ల కిందట కరసేవకుల సజీవ దహనం చేసిన ఘటనలో ప్రధాని నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. గురజాత్‌ పోలీసులు గోద్రాలో రఫీక్‌ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పంచ్‌మహల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల కిందట గోద్రా ఘటనకు కుట్రపన్నిన కోర్‌ గ్రూప్‌లో రఫీక్‌ హుస్సేన్‌ సభ్యుడు. అయితే పోలీసులకు లభించిన సమాచారం ప్రకారం రైల్వే స్టేషన్‌ సమీపంలో ఒంటి వద్ద మాటు వేసి రఫీక్‌ను అరెస్టు చేశారు. రఫీక్‌హుస్సేన్‌ ఘటన జరిగిన రోజు రైలు కంపార్ట్‌మెంట్‌ తగులబెట్టేందుకు పెట్రోల్‌ సిద్ధం చేశాడని, ఈ కుట్రలో రఫీక్‌ కీలక పాత్రధారి అని పోలీసుల విచారణలో వెల్లడైంది.

అతనిపై పలు కేసులు కూడా నమోదై ఉన్నాయి. కాగా, 2002 ఫిబ్రవరి 27న గోద్రా స్టేషన్‌లో కరసేవకులతో నిండిన ట్రైన్‌కు నిప్పటించారు. ఈ ఘటనలో 59 మంది కరసేవకులు మృతి చెందారు. ఆ సమయంలో రఫీక్‌ హుస్సేన్‌ ఒక కూలిగా అదే స్టేషన్‌లో పని చేస్తున్నాడు. రైలు రాగానే రఫీక్‌ దానిపై రాళ్లు రువ్వి, పె ట్రోల్‌ చల్లాడు. ఈ ఘటన తర్వాత రఫీక్‌ హుస్సేన్‌ ఇక్కడ నుంచి పరారయ్యాడు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తలదాచుకుంటూ వచ్చాడు. ఇటీవలే అతను గోద్రాకు కుటుంబం సహా వచ్చి ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు మాటువేసిన పోలీసులు ఎక్కకేలకు పట్టుకున్నారు.

Also Read: Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 28 మంది దుర్మరణం