Bus Driver: కానిస్టేబుళ్ల చేతివాటం.. తనిఖీల పేరిట బస్సు డ్రైవర్ నుంచి రూ.14 లక్షలు లూటీ!

|

Dec 29, 2023 | 11:02 AM

ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ నుంచి రూ. 14 లక్షలు దోచుకున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ అరెస్టు అయ్యారు. వారిపై పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. అదనపు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ADCP) అభినయ్ విశ్వకర్మ తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 23న నగరంలోని అంకిత్ జైన్ అనే స్థానిక వ్యాపారవేత్తకు చెందిన రూ.14 లక్షల డబ్బును ప్రైవేట్ బస్సు డ్రైవర్ అహ్మదాబాద్‌లో..

Bus Driver: కానిస్టేబుళ్ల చేతివాటం.. తనిఖీల పేరిట బస్సు డ్రైవర్ నుంచి రూ.14 లక్షలు లూటీ!
Police Constables
Follow us on

ఇండోర్‌, డిసెంబర్‌ 29: ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ నుంచి రూ. 14 లక్షలు దోచుకున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ అరెస్టు అయ్యారు. వారిపై పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. అదనపు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ADCP) అభినయ్ విశ్వకర్మ తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 23న నగరంలోని అంకిత్ జైన్ అనే స్థానిక వ్యాపారవేత్తకు చెందిన రూ.14 లక్షల డబ్బును ప్రైవేట్ బస్సు డ్రైవర్ అహ్మదాబాద్‌లో నివసిస్తున్న కన్హయ్య లాల్‌ అనే మరో వ్యక్తికి డెలివరీ చేయడానికి పెట్టెలో తీసుకువెళుతున్నాడు. ఈ క్రమంలో చందన్ నగర్ పోలీసుల స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ యోగేష్ చౌహాన్, దీపక్ యాదవ్‌లకు ఈ విషయం తెలిసింది. అయితే ఇద్దరు కానిస్టేబుళ్లు విచారణ పేరుతో డ్రైవర్ నుంచి ఆ పెట్టెను స్వాధీనం చేసుకున్నారు.

అయితే దీనిపై వారు పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వలేదు. దీంతో వ్యాపార వేత్త జైన్ నగరంలోని చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బస్సు డ్రైవర్ నరేంద్ర తివారీపై చీటింగ్‌ కేసు పెట్టాడు. విచారణలో అసలు విషయం బయటపడింది. దర్యాప్తు పేరుతో బస్సు తనిఖీ చేసిన సదరు కానిస్టేబుల్స్ క్యాష్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారని డ్రైవర్‌ పోలీసధికారులకు తెలిపాడు. ఆ డబ్బు‌ను సీజ్ చేసినట్టు పోలీసు స్టేషన్‌‌కు సమాచారం ఇవ్వకుండా వారిద్దరే ఆ నగదును అట్టిపెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వారిపై చర్యలకు ఆదేశించారు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేసి వారిపై ఐపీసీ సెక్షన్ 392 కింద పోలీసులు చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదు చేసి, ఇద్దరినీ అరెస్టు చేశారు.

మరోవైపు వ్యాపారవేత్త అంకిత్ జైన్‌, బస్సు డ్రైవర్‌తో పెద్ద మొత్తంలో డబ్బు తరలించడంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ మొత్తం డబ్బు హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో వారు ఆ డబ్బును స్వాధీనం చేసుకుని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తామని అదనపు డీసీపీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.