Fire Accident in UP: యూపీలోని ఫర్నిచర్ షాప్‌లో అర్థరాత్రి చెలరేగిన మంటలు.. ప్రమాదంలో నలుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి..

|

Nov 30, 2022 | 8:52 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి  ఫిరోజాబాద్ జస్రావాలోని ..

Fire Accident in UP: యూపీలోని ఫర్నిచర్ షాప్‌లో అర్థరాత్రి చెలరేగిన మంటలు.. ప్రమాదంలో నలుగురు చిన్నారులు  సహా ఆరుగురు మృతి..
Fire Accident
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి  ఫిరోజాబాద్ జస్రావాలోని  ఎలక్ట్రానిక్ అండ్ ఫర్నీచర్ షాప్ లో పెద్ద త్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని స్థానిక పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి వచ్చి మంటలను అదుపులోకి  తెచ్చారు. జరిగిన అగ్ని ప్రమాదంపై ఫిరోజాబాద్ ఎస్పీ ఆశిష్ తివారీ మాట్లాడుతూ ‘‘ఫిరోజాబాద్ జిల్లా జస్రానాలోని పాధమ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మరణించినవారిలో నలుగురు చిన్నారులు కూడా ఉండడం బాధాకరం. మంటలను అదుపు చేసేందుకు పోలీసులతో పాటు 18 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇన్వర్టర్‌లో కలిగిన షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి’’ అని అన్నారు.

జస్రావాలోని ఎలక్ట్రానిక్ అండ్ ఫర్నిచర్ షాప్‌లో అర్థరాత్రి చెలరేగిన మంటలు దాని పైనున్న ఇంట్లోకి కూడా వ్యాపించాయి. ఆ మంటల కారణంగా ఆ ఇంట్లోని ఉండే ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మంటలలో చిక్కుకున్నారని స్థానికులు తెలిపారు. వీరిలో ఆరుగురు మరణించగా, ముగ్గురిని రక్షించారు. గాయాలతో బయటపడిన ఆ ముగ్గురిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు..

జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కెట్ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ అండ్ ఫర్నిచర్ షాప్ ఉంది. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఎస్పీ తివారీ తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు ఆగ్రా, మెయిన్‌పురి, ఎటా, ఫిరోజాబాద్‌ల నుంచి దాదాపు 18 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయని ఆయన అన్నారు. దీంతో పాటు 12 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని, దాదాపు రెండున్నర గంటల తర్వాత మంటలను అదుపు చేయగలిగామని చెప్పారు.

సీఎం యోగి సంతాపం వ్యక్తం చేశారు


ఫిరోజాబాద్‌లోని జస్రానాలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా ఆరుగురు చనిపోగా ముగ్గురు క్షతగాత్రులయ్యారు. అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ, మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్థికసాయం పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..