
తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఒక ప్రైవేటు స్కూల్ చీటర్.. 19 ఏళ్ల విద్యార్థినిని రోడ్డుపై కాల్చి చంపిన ఘటన బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో వెలుగు చూసింది. బాలికను అతికిరాతంగా హత్య చేసినందుకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఆ టీచర్ పనిచేస్తున్న స్కూల్‌కు నిప్పుపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమస్తిపూర్ జిల్లాకు చెందిన వినయ్ కుమార్ అనే వ్యక్తికి గుడియా కుమారి అనే 19 ఏళ్ల కూతురు ఉంది. అయితే ఆమె ప్రస్తుతం తమ ఉన్నత విద్యను పూర్తి చేసుకొని గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంది. అయితే నలందా జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ గత కొన్ని రోజులు ప్రేమిస్తున్నానని గడియా వెంటపడుతున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు. అతన్ని ప్రేమించేందుకు గడియా నిరాకరించడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో సోమవారం బహేరి బ్లాక్‌లోని కోచింగ్ సెంటర్ నుంచి గడియా ఇంటికి తిరిగి వస్తుండగా శివాజీనగర్‌లో ఆమెను అడ్డుకున్నాడు. వెంటనే తన దగ్గరున్న తుపాకీ తీసుకొని గడియాన్ కాల్చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో సదరు వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహంతో నిందితుడు పనిచేస్తున్న స్కూల్ దగ్గరకు వెళ్లారు. పెట్రోల్ తీసుకొచ్చి స్కూల్‌కు నిప్పంటించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న రహదారిపై విద్యార్థిని మృతదేహం ధర్నాకు దిగారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను శాంతింపజేశారు. ఈ మేరకు బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.