LPG Price Hike: సామాన్యుడికి మళ్లీ షాక్.. గ్యాస్ సిలిండర్‌ ధర పెంపు.. ఎంత పెంచారంటే…

|

Aug 01, 2021 | 8:16 PM

LPG Price Hike: సామాన్యుడికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. చమురు, గ్యాస్ కంపెనీలు..

LPG Price Hike: సామాన్యుడికి మళ్లీ షాక్.. గ్యాస్ సిలిండర్‌ ధర పెంపు.. ఎంత పెంచారంటే...
Gas
Follow us on

LPG Price Hike: సామాన్యుడికి మరో ఎదురుదెబ్బ తగిలింది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. చమురు, గ్యాస్ కంపెనీలు ఎల్‌పిజి సిలిండర్‌పై ఈ సారి రూ. 73.5 పెంచారు. అయితే, 14.2 కేజీల సిలిండర్ రేట్లు మాత్రం మారలేదు. తాజాగా సవరించిన గ్యాస్ సిలిండర్ ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. తాజాగా పెరిగిన ధరలతో కలిపి 19 కిలోల ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో 1,623 కి పెరిగింది. అదే సిలిండర్ ధర ముంబైలో 1,579.50 కి చేరింది. కోల్‌కతాలో రూ. 1629.00, చెన్నై లో 1761.00 రూపాయలకు పెరిగింది. చమురు, గ్యాస్ కంపెనీలు ప్రతీ నెల 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయించారు.

కాగా, వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. జులై 1న ఈ గ్యాస్ ధరలను రూ.25.50 పెంచారు. జులైలో పెరిగిన ధరల ప్రకారం 14.2 కేజీల ఎల్‌పిజి సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 834.50 గా ఉంది. ముంబైలో రూ. 834.50, కోల్‌కతాలో రూ. 861, చెన్నైలో రూ .850.50 గా ఉంది. కాగా, 2021 సంవత్సరంలో ఇప్పటి వరకు వంట గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 138.50 పెంచారు. జనవరి 1న 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 694 ఉండగా.. ఇప్పుడు అది 834.50 కి చేరింది.

అయితే, గత ఏడు సంవత్సరాల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర రెండింతలు పెరిగింది. ఢిల్లీలో 2014 మార్చి 1వ తేదీన 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 410.50 ఉండగా.. ఏడేళ్లుగా వరుసగా పెరిగిన ధరలతో కలిపి అదే సిలిండర్ ఇప్పుడు దేశ రాజధానిలో రూ. 834.50 వద్ద రిటైల్ అవుతోంది.

పేటీఎం బంపర్ ఆఫర్..
అయితే, Paytm బంపర్ ఆఫర్‌ను అమలు చేస్తోంది. దీనిని ఉపయోగించి మీరు వంట గ్యాస్ సిలిండర్‌ను ఉచితంగా కొనుగోలు చేయవచ్చు. ఫిన్‌టెక్ యాప్ కొత్త కస్టమర్ల కోసం గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై రూ. 900 క్యాష్‌బ్యాక్ అవకాశాన్ని అందిస్తోంది. ఆఫర్‌లో భాగంగా మీరు కనీసం రూ .10 క్యాష్‌బ్యాక్ నుంచి గరిష్టంగా రూ. 900 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Also read: