మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దాసంగా ప్రాంతంలో బస్సు అదుపుతప్పి బ్రిడ్జ్‌పై నుంచి కింద పడిపోయింది. ఈ దుర్ఘటనలో 15మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మంది గాయాలపాలయ్యారు. చనిపోయివారిలో ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయ 8.30 గంటలకు శ్రీఖండి నుంచి ఇండోర్‌కు బస్సు వెళ్తోంది. దాసంగా ప్రాంతం సమీపంలోని డొంగరగౌన్ బ్రిడ్జి పైకి రాగానే బస్సు అదుపు తప్పి కిందపడిపోయింది.
మృతుల్లో డ్రైవర్, కండక్టర్, క్లీనర్ కూడా ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సహాయకచర్యలను పర్యవేక్షించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ సర్కారు స్పందించింది. మృతుల కుటంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగా తీవ్రంగా గాయాలపాలైనవారికి రూ.50 వేలు.. స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు ఇస్తామని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..