Leopards: గ్వాలియర్‌కు చేరుకున్న 12 చిరుతలు.. కునో పార్క్‌లో రిలీజ్ చేయనున్న సీఎం చౌహాన్..

|

Feb 18, 2023 | 11:30 AM

దక్షిణాఫ్రికా నుండి మన దేశానికి తీసుకొచ్చిన ఈ చిరుతల్లో ఏడు మగ చిరుతలు, ఐదు ఆడ చిరుతలు ఉన్నాయి. కునో చేరుకున్న తర్వాత..  ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ఈ చిరుతలను స్వాగతించి వాటిని ఎన్‌క్లోజర్‌లో విడుదల చేస్తారు.

Leopards: గ్వాలియర్‌కు చేరుకున్న 12 చిరుతలు.. కునో పార్క్‌లో రిలీజ్ చేయనున్న సీఎం చౌహాన్..
Leopards From South Africa
Follow us on

దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 12 చిరుతలు భారత్‌కు చేరుకున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన C-17 గ్లోబ్‌మాస్టర్ కార్గో విమానం ఉదయం పది గంటలకు ఈ చిరుతలను తీసుకుని మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ విమానాశ్రయంలో దిగింది. ఇక్కడి నుంచి ఈ చిరుతలను హెలికాప్టర్‌లో  కునో నేషనల్ పార్క్ కు తరలించనున్నారు. ఈ చిరుతలు ఒక నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచనున్నారు. ఈ మేరకు చిన్న ఎన్‌క్లోజర్‌లో ఉంచి.. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడే విధంగా చేసిన అనంతరం వాటిని ఓపెన్ ఫారెస్ట్‌లో వదిలేస్తారు. కునో చేరుకున్న తర్వాత..  ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ఈ చిరుతలను స్వాగతించి వాటిని ఎన్‌క్లోజర్‌లో విడుదల చేస్తారు.

దక్షిణాఫ్రికా నుండి మన దేశానికి తీసుకొచ్చిన ఈ చిరుతల్లో ఏడు మగ చిరుతలు, ఐదు ఆడ చిరుతలు ఉన్నాయని అధికారులు చెప్పారు. అంతకుముందు సెప్టెంబర్ 2020లో..  ఎనిమిది చిరుతలను నమీబియా నుండి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిరుతలను తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్క్‌లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీంతో ఇప్పుడు వచ్చిన 12 చిరుతలతో ఇప్పుడు కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సంఖ్య  20కి పెరుగుతుంది. 1952లో చిరుతలు భారత దేశంలో చిరుతలు అంతరించిపోయినట్లు ప్రకటించబడ్డాయి. పర్యావరణాన్ని సమతుల్యం చేసే లక్ష్యంతో గతంలో ఆఫ్రికా దేశాల నుంచి చిరుతలను తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ  చొరవతో 71 ఏళ్ల తర్వాత మరోసారి చిరుతలతో భారత భూమి కళకళలాడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..