Hathras Stampede: మాటలకందని విషాదం.. తొక్కిసలాటలో 107 మందికిపైగా మృతి.. వందలాది మందికి గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ తొక్కిసలాటలో జరిగింది. ఈ ఘటనలో 107 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది గాయపడ్డారు. హత్రాస్ జిల్లా సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని రతిభాన్‌పుర్‌లో భోలే బాబా సత్సంగ్ శివారాధన కార్యక్రమ సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది

Hathras Stampede: మాటలకందని విషాదం.. తొక్కిసలాటలో 107 మందికిపైగా మృతి.. వందలాది మందికి గాయాలు
Hathras Stampede
Follow us

|

Updated on: Jul 02, 2024 | 7:38 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ తొక్కిసలాటలో జరిగింది. ఈ ఘటనలో 107 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది గాయపడ్డారు. హత్రాస్ జిల్లా సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని రతిభాన్‌పుర్‌లో భోలే బాబా సత్సంగ్ శివారాధన కార్యక్రమ సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ కార్యక్రమంలో పవిత్ర జలం పేరుతో భక్తులకు నీళ్లు ప్రసాదం ఇస్తారు.. ఈ జలం స్వీకరిస్తే సర్వరోగాలు పోయాయని నమ్మకం.. దీంతో దేశం నలుమూలల నుంచి దాదాపు 4లక్షల మంది వరకూ హాథ్రాస్‌ చేరుకున్నారు. ఈ ఘటనలో వందలాది మంది గాయపడ్డారు. వారిలో మహిళలు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గర్లోని ఎటా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

స్థానిక ఆధ్యాత్మిక గురువు సంస్మరణార్థం ఏడాదికి ఒకసారి మాత్రమే జరిగే ఈ కార్యక్రమానికి.. నిర్వాహకులు భోలే బాబా సత్సంగ్‌ పేరుతో భారీగా ప్రచారం నిర్వహించారు. దీంతో ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 50 వేలమందికి పైగా వచ్చిన భక్తులను.. రాత్రి 11 గంటల నుంచి బారికేడ్లు అడ్డుపెట్టి..రోడ్లపై నిర్బందించారు. ఉదయం ఒక్కసారిగా వాటిని తొలగించడంతో భక్తులు దూసుకువచ్చారు. దీంతో భారీ తొక్కిసలాట జరిగింది.

ఈ తొక్కిసలాటలో పదుల సంఖ్యలో మహిళలు, చిన్నారులు బలైపోయారు. గాయపడ్డవారిని ఎటా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మృతదేహలను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే మృతదేహాలను ఉంచేందుకు అక్కడ సరిపడ స్థలం లేకపోవడంతో కమ్యూనిటీ హాల్‌ నేలపైన, ఆవరణలో లైన్‌గా పరిచారు అధికారులు.. కమ్యూనిటీ హాల్‌లో తమవారి మృతదేహాలను చూసి బంధువులు, కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. వారి ఆర్తనాదాలతో ఈ ప్రాంతమంతా విషాదం అలముకుంది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే వారు ఎందుకు పరుగులు తీశారన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.హత్రాస్‌ ఘటనపై లోక్‌సభలో ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

మరోవైపు ఈ విషాదంపై ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం యోగిఆధిత్యనాథ్ ..బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. వీకెండ్‌లో సినిమాలే సినిమాలు..లిస్ట్
ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. వీకెండ్‌లో సినిమాలే సినిమాలు..లిస్ట్
అనంత్‌ అంబానీ-రాధికల 3 రోజుల గ్రాండ్‌ వెడ్డింగ్‌.. షెడ్యూల్ ఇదే!
అనంత్‌ అంబానీ-రాధికల 3 రోజుల గ్రాండ్‌ వెడ్డింగ్‌.. షెడ్యూల్ ఇదే!
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలను ఏకాకి చేయాలి: జైశంకర్‌
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలను ఏకాకి చేయాలి: జైశంకర్‌
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఓర్నీ ఎంత పనైంది.! ఆజామూ రికార్డు బద్దలయ్యిందిగా.. ఎవరంటే
ఓర్నీ ఎంత పనైంది.! ఆజామూ రికార్డు బద్దలయ్యిందిగా.. ఎవరంటే
మందుపార్టీలో మిగిలిన మద్యం బాటిల్స్‌ తీసుకెళ్లాడని దారుణం..
మందుపార్టీలో మిగిలిన మద్యం బాటిల్స్‌ తీసుకెళ్లాడని దారుణం..
'పవిత్ర దర్శన్ భార్య కాదు.. వారిద్దరి మధ్య ఉన్న సంబంధమిదే'
'పవిత్ర దర్శన్ భార్య కాదు.. వారిద్దరి మధ్య ఉన్న సంబంధమిదే'
ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్ష యోగం.. తప్పనిసరిగా సంపద వృద్ధి..!
ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్ష యోగం.. తప్పనిసరిగా సంపద వృద్ధి..!
వినియోగదారులకు అలర్ట్‌.. జూలై 5న బ్యాంకులు బంద్ ఉంటాయా?
వినియోగదారులకు అలర్ట్‌.. జూలై 5న బ్యాంకులు బంద్ ఉంటాయా?
5 నెలల జైలు జీవితం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం!
5 నెలల జైలు జీవితం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం!