
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి పశ్చిమ షరీరాలోని సెంఘారా గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణం కోసం తవ్వుతుండగా పురాతన నిధి బయటపడింది. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న గ్రామ పెద్ద ఆ నిధితో నిండి ఉన్న పాత్రను తీసుకుని పరారయ్యాడు. అతను ఆ పాత్రను హడావిడిగా తీసుకెళ్తుండగా కొన్ని లోహపు నాణేలు కింద పడటంతో.. గ్రామస్థులు వాటిని సేకరించింది. నిధి బయటపడిందనన్న మాట విన్న వందలాది మంది గ్రామస్తులు అక్కడికి చేరుకుని గొడవకు దిగారు. ఆ సొత్తును గ్రామ పెద్ద తీసుకుపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గొడవ ముదరడంతో పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితిని చక్కదిద్దారు. గ్రామ పెద్ద కోసం గాలింపు చేపట్టారు.
శుక్రవారం నాడు గ్రామ పెద్ద ప్రద్యుమ్న నారాయణ్ సోని, జెసిబి సహాయంతో శ్మశాన వాటిక నిర్మాణం కోసం తవ్వకం పనులు చేయిస్తున్నారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నాణేలతో నిండిన పాత్ర దొరికింది. మాములుగా అయితే ఆ నిధి గురించి అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఆ పెద్ద మనిషి ఆ సంపదపై ఆశపడి.. ఆ పాత్ర తీసుకుని పరారయ్యాయి. ఆ సమంయలో కొన్ని నాణేలు కిందపడ్డాయి. అవి పసుపు, తెలుపు కలయికతో కూడిన లోహాలతో తయారు చేసినట్లు ఉన్నాయి. వాటిపై 1906 సంవత్సరం అచ్చువేసి ఉంది.
రోడ్డుపై గ్రామస్తులకు దాదాపు 15 నాణేలు దొరికాయని.. వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. మరోవైపు, బ్రిటీష్ కాలంలో చెలామణిలో ఉన్నఆ నాణేలకు సంబందించిన పూర్తి వివరాలు తెసుకోడానికి పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చారు.
Unearthed Coins
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..