Bengal: గడచిన 24 గంటల్లో 10 మంది నవజాత శిశువులు మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల నిరసన

|

Dec 08, 2023 | 4:25 PM

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో 24 గంటల వ్యవధిలో రెండేళ్ల చిన్నారితోపాటు పది మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఆస్పత్రిలోని సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్ (SNCU), పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU) వార్డుల్లో గురువారం మృతి చెందారు. బాధిత తల్లిదండ్రులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. శిశువుల మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేయడానికి ఇప్పటికే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. జంగిపూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఎస్‌ఎన్‌సీయు వార్డులో పునరుద్ధరణ..

Bengal: గడచిన 24 గంటల్లో 10 మంది నవజాత శిశువులు మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల నిరసన
10 Infants Died In Last 24 Hours
Follow us on

ముర్షిదాబాద్, డిసెంబర్ 8: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో 24 గంటల వ్యవధిలో రెండేళ్ల చిన్నారితోపాటు పది మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఆస్పత్రిలోని సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్ (SNCU), పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU) వార్డుల్లో గురువారం మృతి చెందారు. బాధిత తల్లిదండ్రులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. శిశువుల మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేయడానికి ఇప్పటికే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. జంగిపూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఎస్‌ఎన్‌సీయు వార్డులో పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున అక్కడ చికిత్స పొందుతున్న శిశువులను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు రెఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో అడ్మిట్ అయ్యే రోగుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రిలో రద్దీ నెలకొంది. ఆస్పత్రి వార్డులో సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం వల్లనే శిశువులు మరణించినట్లు దర్యాప్తులో తేలింది. దిగ్భ్రాంతికరమైన మరణాలకు దారితీసిన పరిస్థితులపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు.

కాగా ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో (SNCU) వార్డులో 52 పడకలు ఉన్నాయి. జంగిపూర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నుంచి మరికొంత మంది శిశువులను ఆస్పత్రిలో చేర్చడంతో మొత్తం శిశువుల సంఖ్యకు వందకు చేరింది. ఉన్నట్లుండి శిశువుల రద్దీ పెరగడంతో వైద్య కాలేజీ ఆస్పత్రిలో ఒక్కో బెడ్‌పై ముగ్గురు శిశువులకు చికిత్స అందించసాగారు. సిబ్బంది, వైద్యులు వారికి తగిన చికిత్స అందించడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ చేరిన మొత్తం శిశువుల్లో అధిక శాతం తక్కువ బరువు, పోషకాహార లోపంతో ఉన్నారని, ఆసుపత్రి అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించలేదని ఎంఎస్‌విపి ప్రిన్సిపాల్‌ అనాది రాయ్‌ మీడియాకు తెలిపారు. మృతి చెందిన పది మంది శిశువుల్లో ముగ్గురు ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జన్మించారని ఆయన తెలిపారు. మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా వేరే ఆస్పత్రుల నుంచి ఇక్కడికి తీసుకొచ్చారన్నారు.

తాజా ఘటనపై ప్రస్తుతం విచారణ ప్రారంభించారని, విచారణ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి వివరాలు తెలుస్తాయని జంగీపూర్‌ సబ్‌ డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ అవినాష్‌ కుమార్‌ తెలిపారు. 24 గంటల్లో తొమ్మిది మంది శిశువులు మరణించారనే వార్త వ్యాపించడంతో, మరణించిన పిల్లల కుటుంబాలు ఆసుపత్రి ఎదుట నిరసనలకు దిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.