BJP: లోక్‎సభ స్పీకర్‎కు రాజీనామా లేఖను అందజేసిన 10 మంది బీజేపీ ఎంపీలు.. అసలు కారణం ఇదే

|

Dec 06, 2023 | 9:48 PM

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఇందులో మూడు చోట్ల బీజేపీ తన జెండా ఎగురవేసింది. కాంగ్రెస్ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లలో కొందరు ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వీరిలో కొందరు కేంద్ర మంత్రులు కూడా ఉండటం గమనార్హం.

BJP: లోక్‎సభ స్పీకర్‎కు రాజీనామా లేఖను అందజేసిన 10 మంది బీజేపీ ఎంపీలు.. అసలు కారణం ఇదే
10 Bjp Mps Submitte Their Resignation Letters To Loksabha Speaker Om Birla
Follow us on

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఇందులో మూడు చోట్ల బీజేపీ తన జెండా ఎగురవేసింది. కాంగ్రెస్ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లలో కొందరు ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వీరిలో కొందరు కేంద్ర మంత్రులు కూడా ఉండటం గమనార్హం. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు సాధించడంతో ఆయా రాష్ట్రాల్లో కమలం నేతలు ముఖ్యమంత్రులను నియమించేందుకు సిద్దమైంది. దీని కోసం ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది.

ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఎంపీలు 12 మంది ఉన్నారు. వీరిలో 10 మంది ఈరోజు లోక్‎సభ స్పీకర్ ఓం బిర్లాకు తమ రాజీనామా లేఖలను అందించారు. ఈ మొత్తం వ్యవహారం ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జరిగింది.

రాజీనామా చేసిన ఎంపీల వివరాలు..

మధ్యప్రదేశ్ నుంచి కేంద్ర వ్యవసాయ మంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర సింగ్ తోమర్‎తోపాటూ జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, రితి పాఠక్, రాకేశ్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. ఛత్తీస్‎గఢ్ నుంచి అరుణ్ సావో, గోమతి సాయి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక రాజస్థాన్ నుంచి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, దియా కుమారి రాజీనామా పత్రాన్ని స్పీకర్‎కి అందజేశారు. వీరందరితో పాటూ రాజ్యసభ సభ్యులుగా ఉన్న కిరోరిలా మీనా స్పీకర్ ఓం బిర్లాకు కాకుండా రాజ్యసభ ఛైర్మెన్‎కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..