మీ వాళ్లు చేసే పనికి.. చివరికి తుపాకులే మిగులుతాయి: లోకేష్ ట్వీట్
రివర్స్ టెండరింగ్ అంటే వైసీపీ ఎమ్మెల్యేలు.. కంపెనీలకు టెండర్ పెట్టడం అని ఆలస్యంగా అర్ధం అయ్యింది జగన్ గారు అంటూ నారాలోకేష్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కంపెనీలు ఉండాలి అంటే మాకు ట్యాక్స్ కట్టాల్సిందే అంటూ మీ నాయకులు నిన్న కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులోకి చొరబడి తుపాకీతో బెదిరించారని ఆరోపించారు. మొన్న మీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లా మైలవరం మండలంలో ఓ సోలార్ పార్క్ […]
![మీ వాళ్లు చేసే పనికి.. చివరికి తుపాకులే మిగులుతాయి: లోకేష్ ట్వీట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2019/07/Jaga-Lokesh.png?w=1280)
రివర్స్ టెండరింగ్ అంటే వైసీపీ ఎమ్మెల్యేలు.. కంపెనీలకు టెండర్ పెట్టడం అని ఆలస్యంగా అర్ధం అయ్యింది జగన్ గారు అంటూ నారాలోకేష్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కంపెనీలు ఉండాలి అంటే మాకు ట్యాక్స్ కట్టాల్సిందే అంటూ మీ నాయకులు నిన్న కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులోకి చొరబడి తుపాకీతో బెదిరించారని ఆరోపించారు. మొన్న మీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లా మైలవరం మండలంలో ఓ సోలార్ పార్క్ లోని సోలార్ ప్యానల్స్ ధ్వంసం చేసారన్నారు. మీ ఎమ్మెల్యేలు పగలకొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత భవిష్యత్తు అన్నారు. మీ వాళ్ల దౌర్జన్యకాండ ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి మీ సైన్యం పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయని లోకేష్ ట్వీట్ చేశారు.
రివర్స్ టెండరింగ్ అంటే వైకాపా ఎమ్మెల్యేలు కంపెనీలకు టెండర్ పెట్టడం అని ఆలస్యంగా అర్థం అయ్యింది @ysjagan గారు. pic.twitter.com/bRmgEjQoPX
— Lokesh Nara (@naralokesh) July 5, 2019
మీ ఎమ్మెల్యేలు పగలకొడుతుంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత భవిష్యత్తు. మీ వాళ్ళ దౌర్జన్యకాండ ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి మీ సైన్యం పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయి.
— Lokesh Nara (@naralokesh) July 5, 2019