లాక్‌డౌన్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై పోలీసు కేసు
లాక్‌డౌన్ ఉల్లంఘించినందుకు ఓ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే రవీ రాణాపై లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా..

లాక్‌డౌన్ ఉల్లంఘించినందుకు ఓ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే రవీ రాణాపై లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రవీ రాణా అనుచరులు తొలగించారని, ఆంక్షలు అమలులోవున్న ఇర్వన్ స్వ్కేర్ వద్దకు వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారని ఓ అధికారి తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ, ఈ తరహా చర్యల వల్ల ప్రమాదాన్ని మరింతగా పెంచుతాయని, దీంతోనే ఆయనపై కేసు నమోదు చేసినట్లు గడేనగర్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ మనీశ్ థాకరే వెల్లడించారు. ఆయనతో పాటు మరో ఐదుగురిపైనా ఐపీసీలోని సెక్షన్ 188, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
Learn More:
లాక్‌డౌన్‌లో అదే పని.. పోర్న్ చూడటంలో భారత్ ఫస్ట్ ప్లేస్
బ్రేకింగ్: వికారాబాద్‌లో వారం రోజుల పాటు సకలం బంద్.. కలెక్టర్ సంచలన నిర్ణయం