
మనదేశంలో ఎంతో మంది విదేశీయులు పర్యటిస్తూ ఉంటారు. కొంతమంది ఇండియా ఒక మురికి దేశంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ, ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న ఓ ప్రపంచ యాత్రికుడు మాత్రం అసలు ఇండియా గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు. ఇండియాలో మీరు చూసే ప్రతిదాన్ని నమ్మవద్దు, ప్రజలు ఆన్‌లైన్‌లో లాట్‌లను చూపిస్తారు, సాధారణంగా ప్రతికూలంగా ఉంటారు, కానీ చండీగఢ్ వంటి ప్రదేశాలు, చాలా శుభ్రంగా, చాలా ఆధునిక నగరం అని సుఖ్నా సరస్సులో పడవ ప్రయాణం చేస్తూ పోర్టర్ అన్నారు.
ఇది భారతదేశంలోని గొప్ప నగరాల్లో ఒకటి. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మందికి దీని గురించి తెలియకపోవచ్చు. సాధారణంగా చాలా మంది టూరిస్ట్‌లు ఆగ్రా, ఢిల్లీ, జైపూర్‌లలో పర్యటిస్తారు. కానీ, ఇలాంటి నగరాలను మిస్ అవుతారు అని పోర్టర్ వెల్లడించాడు. చండీగఢ్ వైవిధ్యభరితమైన జనాభా, నగరం సమర్థవంతమైన, ప్రణాళికాబద్ధమైన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను కూడా పోర్టర్ హైలైట్ చేశాడు.
ఈ నగరం పంజాబీ, హర్యాన్వి సంస్కృతి అద్భుతమైన మిశ్రమాన్ని కలిగి ఉంది, కాబట్టి ఇది చాలా వైవిధ్యమైనది. ఆహారం అద్భుతంగా ఉంది, ఇది భారతదేశంలోని అత్యంత పచ్చని, పరిశుభ్రమైన నగరాల్లో ఒకటి అని ఆయన అన్నారు. అతను ఇండియాను ఎక్స్‌ప్లోర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి