world sleep day 2023 : చాలా మంది స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ స్పీకర్, స్మార్ట్ వాచీలను గురించి వినే ఉంటారు. కొంతమంది వాడుతుంటారు కూడా. కానీ మీరేప్పుడైనా స్మార్ట్ పిల్లో గురించి విన్నారా..? అవును, స్మార్ట్ దిండు కూడా అందుబాటులోకి వచ్చేసింది. షియోమీ గతేడాది సెప్టెంబర్‌లో స్మార్ట్ పిల్లోని లాంచ్ చేసింది. ఈ దిండును గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయడానికి బదులుగా, దీన్ని చైనా మార్కెట్‌లో మాత్రమే విడుదల చేశారు. అయినప్పటికీ ఈ దిండు ఫీచర్స్ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. కంపెనీ ప్రకారం, ఈ దిండు హృదయ స్పందన, గురక, శరీర కదలిక, శ్వాసను ఖచ్చితంగా సంగ్రహించగలదు. ఈ రోజు ప్రపంచ నిద్ర దినోత్సవం 2023 సందర్భంగా ఈ దిండు ఫీచర్లు, ధరను తెలుసుకుందాం.
కొత్త Xiaomi స్మార్ట్ పిల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం AI అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. ఈ దిండు నిద్రలో ఎలాంటి అడ్డంకి లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది. ఈ స్మార్ట్ పిల్లో వినియోగదారుల నిద్ర స్థితి, నిద్ర గాఢత అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందిస్తుంది. మీ నిద్ర స్కోర్‌ను కూడా చెబుతుందని కంపెనీ తెలిపింది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. దాంతో ఇది ఇతర స్మార్ట్ పరికరాలకు కనెక్ట్ చేయబడుతుంది. ఈ దిండు కోసం కంపెనీ స్లీప్ సైకిల్ గ్యారెంటీని అందిస్తుంది. దిండు ఛార్జ్ చేయాలి. దీని కోసం ఇది 4 AAA బ్యాటరీలతో ఏర్పాటు చేశారు, ఇది గరిష్టంగా 60 రోజుల ఉపయోగం కోసం కావాల్సిన శక్తిని అందిస్తుంది.
ప్రశాంతమైన నిద్రను ఇచ్చే ఈ దిండు ధర 299 యువాన్లు అంటే దాదాపు 3,434 రూపాయలు. చైనీస్ మార్కెట్‌లో ఈ దిండు దొరుకుతుంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. MIJIA స్మార్ట్ పిల్లో కండరాలను సడలించడంతోపాటు వినియోగదారులకు ప్రశాంతమైన, తాజా నిద్రను అందిస్తుంది. కాబట్టి, ఈ దిండు డబ్బుకు విలువైనదని కంపెనీ చెబుతోంది. దిండు బలమైన యాంటీ బాక్టీరియల్ రక్షణతో వస్తుంది. దీని వెలుపలి భాగం మృదుత్వం ఏడు స్క్రీన్‌లకు సమానంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..