Broccoli Benefits: బంగారం కంటే విలువైనది.. బ్రోకలీ గురించి మీకు తెలియని నిజాలు!

|

Feb 15, 2024 | 2:18 PM

'బ్రోకలీ' బంగారం కంటే విలువైనదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కూరగాయాల్లో ఇది కూడా ఒకటి. పోషకాల పవర్ హౌస్‌గా కూడా పిలుస్తారు. శరీరంలో అవసరం అయ్యే ఎన్నో పోషకాలు బ్రోకలీలో లభిస్తాయి. తరుచుగా బ్రోకలీ తింటే.. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గడమే కాకుండా.. రాకుండా ఉంటాయి. బ్రోకలీ తింటే ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. దీన్ని తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. బ్రోకలీలో విటమిన్లు సి, కె, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం..

Broccoli Benefits: బంగారం కంటే విలువైనది.. బ్రోకలీ గురించి మీకు తెలియని నిజాలు!
Broccoli
Follow us on

‘బ్రోకలీ’ బంగారం కంటే విలువైనదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కూరగాయాల్లో ఇది కూడా ఒకటి. పోషకాల పవర్ హౌస్‌గా కూడా పిలుస్తారు. శరీరంలో అవసరం అయ్యే ఎన్నో పోషకాలు బ్రోకలీలో లభిస్తాయి. తరుచుగా బ్రోకలీ తింటే.. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గడమే కాకుండా.. రాకుండా ఉంటాయి. బ్రోకలీ తింటే ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. దీన్ని తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. బ్రోకలీలో విటమిన్లు సి, కె, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, ఫోలేట్, యాంటీ ఆక్సిడెండ్లు వంటివి మెండుగా ఉంటాయి. జీర్ణ శక్తి కూడా మెరుగు పడుతుంది. ఇంకా బ్రోకలీ తింటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

క్యాన్సర్ నివారిణి:

బ్రోకలీ తరుచుగా తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. ఇందులో ఇండోల్ 3 కార్బినోల్, సల్ఫోరాఫేన్ వంటి ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తాయి. కాబట్టి బ్రోకలీని అప్పుడప్పుడైనా తీసుకోవడం చాలా మంచిది.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:

బ్రోకలీ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అనేవి మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా.. అదుపులో ఉంచుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇతర గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఎముకలు దృఢంగా ఉంటాయి:

బ్రోకలీ తినడం వల్ల ఎముకల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. బ్రోకలీలో క్యాల్షియంతో పాటు విటమిన్ కె కూడా ఉంది. ఇవి ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడతాయి. అంతే కాకుండా ఇందులో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరంలో వాపులు, నొప్పులను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

కంటి ఆరోగ్యం:

బ్రోకలీలో విటమిన్ ఎ, లూటిన్, జియాక్సంతిన్ వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి బ్రోకలీ తినడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా బ్రోకలీ బెస్ట్. దీన్ని సలాడ్స్‌లో యాడ్ చేసుకుని తినచ్చు.

చర్మ ఆరోగ్యం:

బ్రోకలీ తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉంటాయి. ఈ విధంగా బ్రోకలీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇతర ఇన్ ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.