Winter immunity: సంపూర్ణ ఆరోగ్యం కోసం శీతాకాలపు సూపర్ ఫుడ్స్.. ఇవి మీ డైట్‌లో ఉంటే..

శీతాకాలంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీని కారణంగా మనం తరచూ జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ, గొంతు నొప్పి వంటి వ్యాధులు భారీన పడుతుంటాం. కాబట్టి ఈ సీజన్‌లో మనం రోగనిరోధక శక్తిని పెంచుకొని వ్యాధులను ఎదుర్కొవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం మనం మంచి ఆహారన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి శీతాకాంలో మనకు ప్రయోజకరంగా ఉండే సూపర్ ఫుడ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Winter immunity: సంపూర్ణ ఆరోగ్యం కోసం శీతాకాలపు సూపర్ ఫుడ్స్.. ఇవి మీ డైట్‌లో ఉంటే..
Winter Immunity

Updated on: Dec 01, 2025 | 2:59 PM

శీతాకాలంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీని కారణంగా మనం తరచూ జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ, గొంతు నొప్పి వంటి వ్యాధులు భారీన పడుతుంటాం. కాబట్టి ఈ సీజన్‌లో మనం రోగనిరోధక శక్తిని పెంచుకొని వ్యాధులను ఎదుర్కొవడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం మనం మంచి ఆహారన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి శీతాకాంలో మనకు ప్రయోజకరంగా ఉండే సూపర్ ఫుడ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

శీతాకాలంతో మన టైట్‌లో ఉండాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే

ఆమ్లా: చలికాలంలో మన డైట్‌లో ఉండాల్సిన సూపర్ ఫుడ్‌లో అమ్లా(ఉసిరి) ఇది మొదటి వరుసలో ఉంది. ఎందుకంటే ఉసరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి ఎంతగానో తోడ్పడుతాయి. అలాగే పేగు ఆరోగ్యానికి సహాయపడుతాయి. దాంతో పాటు సీజనల్ వ్యాధుల నుంచి మనను పూర్తిగా రక్షిస్తాయి. కాబట్టి శీతాకాలంలో మనం ఆరోగ్యంగా ఉండేందుకు మన డైట్‌లో ఉసిరి తప్పనిసరిగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

సజ్జలు: ఇక మనం చలి కాలంలో తినే ఫుడ్స్‌లో ఉండాల్సినవి సజ్జలు. వీటిలో ఇనుము, మెగ్నీషియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే శీతాకాలంలో ఇది మన శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సహాయపడుతుంది. శీతాకాలపు భోజనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

నెయ్యి: ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్ పలువబడే నెయ్యి కూడా మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది, అలాగే పోషకాల శోషణను పెంచుతుంది. రోజుకు కొద్ది మొత్తంలో నెయ్యిని తీసుకోవడం వల్ల ఇది శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. అలాగే పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

చిలగడదుంపలు: ఇవి కూడా శీతాకాలంలో ఆరోగ్యానికి ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో బీటా కెరోటిన్, ఫైబర్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్ల ఉంటాయి. ఇవి మన శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చలి రోజులలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో ఇవి సహాయపడుతాయి.

నువ్వులు: ఇవి శీతాకాలంలో శక్తి కేంద్రంగా పరిగణించబడుతున్నాయి, వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది, చర్మ ఆర్ద్రీకరణను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సహాయపడుతుంది.

బెల్లం: ఇది ఖనిజాలతో నిండిన సహజ స్వీటెనర్, ఇది మన శరీరంలోని విషపదార్థాలను తొలగించేందుకు సహాయపడుతుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

 గమనిక: ఫైన పేర్కోన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.