వీటిని తీసుకున్నారంటే.. మీ హ్యాంగోవర్ అంతా తుస్..
హ్యాంగోవర్ అంటే ఈ పాటికే అర్థం అయి ఉంటుంది. రాత్రిపూట ఫుల్లుగా మందు కొడితే.. ఉదయం లేచే సరికి తల పట్టేసినట్టుగా, తల నొప్పి, వికారం, ఒళ్లు నొప్పులు వస్తాయి. హ్యాంగోవర్ వస్తే ఎలాంటి పనులు కూడా చేయలేం. దేని మీద కూడా దృష్టి పెట్టలేం. మరి హ్యాంగోవర్‌ను తగ్గించుకోవాలంటే.. ఇప్పుడు చెప్పే రెమిడీలు చక్కగా పని చేస్తాయి. మరి ఆ ఇంటి నివారణలు ఏంటో ఈరోజు తెలుసుకుందామా..
Updated on: Dec 01, 2025 | 2:51 PM

హ్యాంగోవర్ అంటే ఈ పాటికే అర్థం అయి ఉంటుంది. రాత్రిపూట ఫుల్లుగా మందు కొడితే.. ఉదయం లేచే సరికి తల పట్టేసినట్టుగా, తల నొప్పి, వికారం, ఒళ్లు నొప్పులు వస్తాయి. హ్యాంగోవర్ వస్తే ఎలాంటి పనులు కూడా చేయలేం. దేని మీద కూడా దృష్టి పెట్టలేం. మరి హ్యాంగోవర్‌ను తగ్గించుకోవాలంటే.. ఇప్పుడు చెప్పే రెమిడీలు చక్కగా పని చేస్తాయి.

హ్యాంగోవర్‌ను తగ్గించడంలో టమాటా జ్యూస్ ఎంతో చక్కగా పని చేస్తుంది. ఈ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీర వాపు, కండరాల నొప్పులు, తలనొప్పి తగ్గుతాయి. వికారం, వాంతులు కూడా త్గుగతాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే.

బచ్చలి కూర, నీళ్లు వేసి స్మూతీలా చేసుకోవాలి. ఇది తాగినా హ్యాంగోవర్ త్వరగా తగ్గుతుంది. శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది. హ్యాంగోవర్ నుంచి త్వరగా బయట పడాలంటే ఈ స్మూతీ ఎంతో చక్కగా పని చేస్తుంది. అల్లం టీ తాగినా మంచి రిలాక్స్ లభిస్తుంది.

కొబ్బరి నీళ్లతో కూడా హ్యాంగోవర్‌ను తగ్గించుకోవచ్చు. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్లు లభిస్తాయి. ఉదయం లేవగానే ఈ నీటిని తాగితే హ్యాంగోవర్ నుంచి బయట పడొచ్చు. బాడీ కూడా హైడ్రేట్‌గా ఉంటుంది.

దోసకాయ నీళ్లు తాగడం వల్ల కూడా హ్యాంగోవర్ నుంచి రిలీఫ్ పొందవచ్చు. దోసకాయను నీటిలో వేసి ఓ గంట తర్వాత ఆ నీటిని తాగాలి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్లు మెండుగా ఉంటాయి. ఇందులో నిమ్మకాయ కూడా పిండుకుని తాగవచ్చు.




