
శీతాకాలంలో ప్రతిరోజూ స్నానం చేయడానికి మీకు కష్టంగా ఉంటుందా..? స్నానం చేయలేదని ఇంట్లో తిట్లు పడుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. ఎందుకంటే కొత్త పరిశోధనలు మీకు ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడిస్తున్నాయి. చలికాలంలో రోజువారీ స్నానం అవసరం లేదని సూచిస్తున్నాయి. ఇది ప్రయోజనాలకు బదులుగా హానికరం కావచ్చు అంటున్నారు. ఈ సీజన్‌లో ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు, రోజూ స్నానం చేయకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో ఆధారంగా.. కొత్త పరిశోధన ప్రకారం మీరు ప్రతిరోజూ స్నానం చేయకూడదు. మీరు ప్రతిరోజూ స్నానం చేయవలసిన అవసరం లేదు. ప్రతి మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తే సరిపోతుంది. ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల శరీరానికి వివిధ హాని కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజూ స్నానం చేసే అలవాటును నివారించాలి అంటున్నారు.
శీతాకాలంలో ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు..
ఇటీవలి చర్మవ్యాధి అధ్యయనం ప్రకారం, శీతాకాలంలో ప్రతిరోజూ స్నానం చేయకపోవడం వల్ల మీ జీవితకాలం 34శాతం వరకు పెరుగుతుంది. ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల మీ చర్మంలోని సహజ రక్షణ నూనె పొర తొలగిపోతుంది. ఈ నూనె పొర మీ చర్మాన్ని పొడిబారడం, బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు, మొటిమల నుండి రక్షిస్తుంది. అందువల్ల, శీతాకాలంలో ప్రతిరోజూ స్నానం చేయడం అవసరం లేదని పరిశోధనలు సూచిస్తున్నాయి. వారానికి 2-3 సార్లు స్నానం చేస్తే సరిపోతుంది.
రోజూ స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు..
1. రోజూ స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. చల్లని గాలి, వేడి నీరు చర్మం సహజ నూనెలను తీసివేస్తాయి.
2. రక్షిత నూనె పొర లేకుండా, చర్మం సున్నితంగా మారుతుంది. ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ప్రమాదాన్ని పెంచుతుంది.
3. వృద్ధాప్యం వేగంగా కనిపించవచ్చు. సహజ నూనెలు కోల్పోవడం వల్ల ముడతలు, పొడిబారడం జరుగుతుంది.
ప్రతిరోజూ స్నానం చేయడానికి బదులుగా ఏం చేయాలి
1. ప్రతిరోజూ స్నానం చేయడానికి బదులుగా, మీ చర్మాన్ని మాయిశ్చరైజర్‌తో హైడ్రేట్ చేయండి. ముఖ్యంగా మీ చేతులు, కాళ్ళు, ముఖంపై.
2. చర్మంపై దుమ్ము, చెమట రోజూ పేరుకుపోతాయి. కాబట్టి ప్రతిరోజూ చేతులు, ముఖం కడుక్కోండి. మిగిలిన శరీరానికి వారానికి 2-3 సార్లు స్నానం చేస్తే సరిపోతుంది.
3. శీతాకాలంలో గోరువెచ్చని నీరు అవసరం. కానీ, చాలా వేడిగా లేదా ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది.
4. ప్రతిరోజూ స్నానం చేయడానికి బదులుగా, మీ బట్టలు శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజూ మీ లోదుస్తులను మార్చుకోండి.
5. మీరు ప్రతిరోజూ జిమ్‌కి వెళితే లేదా వ్యాయామం చేస్తుంటే, వ్యాయామం తర్వాత తేలికపాటి స్నానం చేయండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.