
చలికాలం వచ్చేసింది అంటే వాతావరణంలో మార్పులు కారణంగా నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి. శిశువులను వెచ్చగా ఉంచడం నుండి ఇన్ఫెక్షన్లను నివారించడం వరకు వైద్యులు సూచించిన ముఖ్యమైన చిట్కాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. శిశువును వెచ్చగా ఉంచడానికి టోపీలు, సాక్స్, తగినంత దుస్తులు ధరించాలి. గది ఉష్ణోగ్రత కూడా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. శిశువు నిద్రపోయేటప్పుడు దుప్పటితో కప్పడం అస్సలు చేయకూడదు. దీనివల్ల SIDS (సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్) ప్రమాదం పెరుగుతుంది. ఇది ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో మరణానికి అత్యంత సాధారణ కారణం.
చలికాలంలో నవజాత శిశువులకు స్నానం చేయించేటప్పుడు కేవలం గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. శిశువును ఎక్కువసేపు స్నానం చేయించకూడదు. స్నాన సమయాన్ని 2 నుండి 3 నిమిషాలలోపు పూర్తి చేయాలి. సువాసనగల సబ్బులను వాడటం మానుకోవాలి.
నవజాత శిశువులకు రోగనిరోధక శక్తి నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని వారాల పాటు బంధువులు, స్నేహితులను ఇంటికి ఆహ్వానించకుండా ఉండటం మంచిది. అలాగే జలుబు లేదా ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్న వ్యక్తుల నుండి శిశువును తప్పనిసరిగా దూరంగా ఉంచాలి.
మీ బిడ్డను తాకే ముందు మీ చేతులను పూర్తిగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ బిడ్డ నిద్రపోయే మరియు ఆడే ప్రదేశాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని టీకాలను సకాలంలో ఇవ్వడంపై శ్రద్ధ వహించాలి.
చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండడానికి తేలికపాటి, శిశువుకు సురక్షితమైన మాయిశ్చరైజర్‌ను పూయండి. బిడ్డ ముక్కు మూసుకుపోయి ఉంటే వైద్యుల సలహా మేరకు సెలైన్ డ్రాప్స్ ఉపయోగించాలి. పరిమళ ద్రవ్యాలు, అగరుబత్తులు, వంట పొగలు, హీటర్ పొగలు, వాహన పొగలకు బిడ్డను దూరంగా ఉంచాలి.
నవజాత శిశువులలో సమస్యలను గుర్తించడం కష్టం కాబట్టి తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కింది లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి:
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..