
పర్యావరణవేత్తలు ప్లాస్టిక్‌ను నిషేధించాలని పిలుపునిచ్చినా ఇళ్లలో వీటి వాడకం అడ్డుకట్టపడటం లేదు. ముఖ్యంగా వేడి ఆహార పదార్థాల కోసం ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించడం హానికరం. వేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ పాత్రలలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచకూడదు. ముఖ్యంగా వేడి అన్నాన్ని ప్లాస్టిక్ కంటైనర్‌లో ఉంచితే ప్రాణానికే ప్రమాదం. ప్లాస్టిక్ కంటైనర్లకు అలవాటు పడి చాలా మంది లంచ్, డిన్నర్‌లకు వీటిని వినియోగిస్తున్నారు. వేడి అన్నం ప్లాస్టిక్ కంటైనర్లలో ఉంచితే ఏం జరుగుతుందో నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..
ప్లాస్టిక్ కంటైనర్లలో వేడి అన్నం నిల్వ చేయకూడదు. ఆయుర్వేద ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బియ్యాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేస్తే అది విషంగా మారుతుంది. వేడి వల్ల ప్లాస్టిక్ కంటైనర్ల లోపల అఫ్లాటాక్సిన్లు, మైకోటాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. ప్లాస్టిక్ కంటైనర్లలో అన్నం నిల్వ చేయడం అందుకే మానుకోవాలి.
ఆకుకూరలను కోసి ప్లాస్టిక్ కంటైనర్‌లో నిల్వ చేసినప్పుడు, అవి తేమను కోల్పోతాయి. ఈ తేమ వల్ల ఆకుకూరలు విషంగా మారుతాయి. ఇది మీ శరీరానికి హానికరం.
ఉడికించిన పప్పులు, బీన్స్‌లను రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ చేసే అలవాటు మీకు ఉంటే ఈరోజే మానేయండి. ఇలా నిల్వ చేయడం వల్ల వీటిల్లోని పొటాషియం, మెగ్నీషియంతోపాటు ఇతర పోషకాలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల పోషకాలు కోల్పోయిన ఆహారం తీసుకోవడం వల్ల చివరికి కేలరీలు మాత్రమే మీ శరీరంలోకి చేరతాయి.
నారింజ, బెల్ పెప్పర్స్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను ప్లాస్టిక్ కంటైనర్లలో వేయకూడదు. ఎందుకో తెలుసా? వీటిని ప్లాస్టిక్ కంటైనర్‌లో పెడితే గాలి వెళ్ళడానికి అవకాశం ఉండదు. దీంతో వాటిల్లోని రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు కోల్పోతాయి.
ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్‌లో ఉంచిన తర్వాత దానిని మళ్లీ వేడి చేయవద్దు. దాన్ని మళ్ళీ ఉడికించడం సురక్షితం కాదు. ప్లాస్టిక్ ఒక నిర్దిష్ట రకమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. దీనివల్ల ఆహారంలోని పోషక విలువలు తగ్గుతాయి. వేడి లేదా వండిన ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయడం మంచిది కాదు. కానీ చల్లని, పొడి ఆహారాన్ని నిల్వ చేయొచ్చు. కానీ అది ఆ ప్లాస్టిక్ కంటైనర్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ప్లాస్టిక్ పాత్రలో వేడి నీటిని కూడా ఉంచకూడదు. ప్లాస్టిక్ వేడెక్కినప్పుడు అది రసాయనాలను విడుదల చేస్తుంది. వేడి నీరు కూడా అదే ప్రతిచర్యలకు కారణమవుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.