
బ్లాక్ కాఫీ మీ ఆయుష్షును పెంచుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. కాఫీ వినియోగం, మరణాల తగ్గింపు మధ్య బలమైన సంబంధం కనుగొనబడింది. చక్కెర, పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల మరణ ప్రమాదం తగ్గుతుందని తేలింది. ప్రతిరోజూ 1 నుండి 2 కప్పుల కెఫిన్ కలిగిన కాఫీ తాగేవారికి అన్ని కారణాల వల్ల మరణాల ప్రమాదం, గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం తక్కువగా ఉంటుంది. దీని అర్థం బ్లాక్ కాఫీ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, మీ ఆయుష్షును పెంచడంలో సహాయపడుతుంది.
బ్లాక్ కాఫీ తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు ఉంటే మాత్రం కాఫీ ఎక్కువగా తాగొద్దు. కొలెస్ట్రాల్ఉదయం ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగితే కొవ్వు కరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం బ్లాక్ కాఫీ తాగడం మంచిది. బ్లాక్ కాఫీ శరీరంలో మెటాబలిజం రేటును పెంచుతుంది. తద్వారా కేలరీల ఖర్చు పెరిగి సులువుగా బరువు తగ్గుతారు. అందుకే బరువు తగ్గాలంటే ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం మేలు.
బ్లాక్ కాఫీ తాగడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. తద్వారా శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది. రోజంతా ఎనర్టిటిక్‌గా ఉంటారు. రోజూ పరిమిత మోతాదులో బ్లాక్ కాఫీ తాగితే హృదయ సమస్యలు ఉండవు. గుండె నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ సమస్యలు నివారిస్తాయి.
బ్లాక్ కాఫీ తాగడం వల్ల మూడ్ బాగుంటుంది. ఉత్సాహంగా రోజును ప్రారంభించవచ్చు. చికాకు, ఆందోళన వంటి సమస్యలు ఉండవు. బ్లాక్ కాఫీ లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫ్యాటీ లివర్ వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం ఈ బ్లాక్ కాఫీ తాగడం మేలు. ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగితే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది. మతిమరుపు రాకుండా కాపాడుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..