AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalassaemia Test Vs Marriage: పెళ్లికి ముందు వధువు, వరుడికి ఈ బ్లడ్‌ టెస్ట్ ఎందుకు చేస్తారో తెలుసా?

థలసేమియా అనే వ్యాధి గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అయితే ఈ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ తప్పక కొన్ని వియషాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న సమస్య కాదు. యువతీ, యువకులు పెళ్లికి ముందు ఈ థలసేమియా స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం. థలసేమియా లక్షణాలు ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి ముందుగానే ఎందుకు తెలుసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

Thalassaemia Test Vs Marriage: పెళ్లికి ముందు వధువు, వరుడికి ఈ బ్లడ్‌ టెస్ట్ ఎందుకు చేస్తారో తెలుసా?
Thalassaemia Screening Test Before Marriage
Srilakshmi C
|

Updated on: May 12, 2026 | 9:09 PM

Share

ఇటీవలి కాలంలో దేశంలో థలసేమియా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. థలసేమియా అనేది వంశపారంపర్యంగా వచ్చే రక్త వ్యాధి. శరీరం తగినంత ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అంటే శరీరం తగినంత పరిమాణంలో హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయదు. హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల శరీర అవయవాలకు ఆక్సిజన్ సరిపోకపోవడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వైద్యుల ప్రకారం ఈ వ్యాధి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. తల్లిదండ్రులిద్దరికీ థలసేమియా లక్షణం ఉంటే బిడ్డకు తీవ్రమైన థలసేమియా వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈ కారణంగానే పెళ్లికి ముందు రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సలహా ఇస్తున్నారు. థలసేమియా ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటో? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

థలసేమియా లక్షణాలు

థలసేమియా ఉన్న పిల్లలు సాధారణంగా చిన్న వయస్సు నుండే రక్తహీనత, బలహీనత, అలసట, బరువు, ఎత్తులో సరైన పెరుగుదల లేకపోవడం, పాలిపోయిన చర్మం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడతారు. కొంతమంది పిల్లలలో వారి ముఖంలోని ఎముకల ఆకారంలో మార్పులు కూడా కనిపిస్తాయి. తీవ్రమైన థలసేమియా ఉన్నవారికి క్రమం తప్పకుండా రక్త మార్పిడి అవసరం. చికిత్సలో ఆలస్యం గుండె, కాలేయం ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది.

చికిత్స – జాగ్రత్తలు

వైద్యుల అభిప్రాయం ప్రకారం థలసేమియాకు పూర్తి నివారణ కొన్ని సందర్భాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. కొందరికి ఎముక మజ్జ మార్పిడి ద్వారా శాశ్వత ఉపశమనం లభిస్తుంది. కానీ చాలా మంది రోగులకు నిరంతర చికిత్స, వైద్య పర్యవేక్షణ అవసరం. సమతుల్య ఆహారం, ఐరన్ స్థాయిల పర్యవేక్షణ, సకాలంలో వైద్య పరీక్షలు ఈ వ్యాధిని నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పెళ్లికి ముందు థలసేమియా స్క్రీనింగ్ చేయించుకోవడం ఈ వ్యాధిని నివారించడానికి ఒక ప్రభావవంతమైన మార్గమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us