
తామర గింజలు లేదా ఫూల్ మఖానా ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తినడం అనారోగ్యం అని మీకు తెలుసా? తామర గింజల్లో కాల్షియం అధికంగా ఉండడంతో శరీరం, ఎముకల్లో కాల్షియం నిక్షేపణ పెరుగుతుంది. దీని వల్ల చర్మంపై ఎలర్జీ, కొరోనరీ ఆర్టనరీ వ్యాధి, కిడ్నీల్లో రాళ్లు పెరిగే అవకాశం ఉంది. మఖానాలోని ఉప్పు రక్తపోటును పెంచి గుండె సంబంధిత వ్యాధులను ప్రేరేపిస్తుంది. మఖానాను అతిగా తినడం వల్ల జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మఖానా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, దీనికి అనేక నష్టాలు కూడా ఉన్నాయి. మఖానా ఇనుము, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం మంచి మూలం. ఇది గ్లూటెన్ రహితం కూడా. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తామర గింజలను తినకుండా ఉండాలి. వాటిని తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. నిజానికి, శరీరంలో కాల్షియం స్థాయిలు పెరిగినప్పుడు, అది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. తామర గింజల్లో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. కాబట్టి వాటిని తినకుండా ఉండాలి.
తామర గింజల్లో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, అతిగా తినడం వల్ల భారీగా బరువు పెరిగే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు వీటిని తినడం మానేయండి. వీటిలో కాల్షియం రాళ్ల సైజు పెరిగే విధంగా చేస్తాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..