హెయిర్‌ కలరింగ్‌ అవసరం లేదు.. ఒత్తైన జుట్టుకోసం హెర్బల్‌ షాంపూ.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

ఇకపై మీరు మార్కెట్లో కొనుగోలు చేసిన షాంపూకి బదులుగా ఇలా సిద్ధం చేసిన షాంపూని ఉపయోగించండి. ఇది మీ స్కాల్ప్‌ను శుభ్రపరచడమే కాకుండా, క్రమంగా మీ జుట్టు ఒత్తుగా మారుతుంది.

హెయిర్‌ కలరింగ్‌ అవసరం లేదు.. ఒత్తైన జుట్టుకోసం హెర్బల్‌ షాంపూ.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
White Hair Remedies
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2023 | 5:25 PM

జుట్టు రాలడం, పల్చబడడం అనేది ఈరోజుల్లో సర్వ సాధారణ సమస్యగా తయారైంది. ఎందుకంటే నేటి మార్కెట్‌లో అన్నీ రసాయనాలతో నిండినవే అధికం. దీని కారణంగా క్రమంగా మీ జుట్టు దెబ్బతినడం, రాలిపోవడం, పాడవడం ప్రారంభమవుతుంది. అందుకే మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఈ హెర్బల్ షాంపూ మీ జుట్టును పొడవుగా, మందంగా, దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. మీరు మీ రెగ్యులర్ షాంపూకి బదులుగా ఇంట్లో తయారుచేసిన హెర్బల్ షాంపూని ఉపయోగిస్తే, అది మీ తలని లోపలి నుండి శుభ్రపరుస్తుంది. నెరిసిపోయిన జుట్టును నల్లగా చేస్తుంది. ఇకపై ప్రత్యేకించి హెయిర్‌ కలరింగ్‌ కూడా అవసరం లేదు. ఇంట్లో హెర్బల్ షాంపూ తయారు చేయడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

ఒత్తైన జుట్టు కోసం హెర్బల్ షాంపూ చేయడానికి కావలసిన పదార్థాలు-

– కుంకుడు కాయలు

– ఉసిరికాయలు

ఇవి కూడా చదవండి

– శిఖా కాయలు

– మందార ఆకులు

– తులసి ఆకులు

– కలబంద

హెర్బల్ షాంపూ ఎలా తయారు చేయాలి?..

మందపాటి జుట్టు కోసం హెర్బల్ షాంపూ తయారు చేయడానికి మొదట శిఖా కాయలు, ఉసిరి కాయలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం వాటిని నీటితో ఒక పాన్లో వేసి మరిగించాలి. తర్వాత చల్లారనివ్వాలి. దీని తర్వాత ఆ నీటిలో కుంకుడు కాయలను వేసి బాగా పిండుకుంటే సబ్బు లాంటి పదార్థం తయారవుతుంది. ఆ తరువాత ఈ పదార్థాలన్నింటినీ కలిపి బ్లెండర్లో వేసి బాగా రుబ్బుకోవాలి. తర్వాత బాగా వడకట్టి సీసాలోకి తీసుకోవాలి. అంతే..మందపాటి, ఒత్తైన జుట్టు కోసం హెర్బల్ షాంపూ సిద్ధంగా ఉంది.

ఇకపై మీరు మార్కెట్లో కొనుగోలు చేసిన షాంపూకి బదులుగా ఇలా సిద్ధం చేసిన షాంపూని ఉపయోగించండి. ఇది మీ స్కాల్ప్‌ను శుభ్రపరచడమే కాకుండా, క్రమంగా మీ జుట్టు ఒత్తుగా మారుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..