White Discharge Problem: వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుందా.. జామాకులతో తగ్గించండి..

చాలా మంది లేడీస్‌లో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే ఉంటారు. ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలో తెలీక సతమతమవుతూ ఉంటారు. వైట్ డిశ్చార్జ్ సమస్యను తక్కువ అంచనా వేయకూడదు. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. వైట్ డిశ్చార్జ్ కారణంగా మహిళల్లో నీరసం, అలసట, పలు ఇన్ ఫెక్షన్లు కూడా రావచ్చు. దీన్ని ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే.. దీర్ఘకాలిక వ్యాధులుగా మారవచ్చు. అలాగే వైట్ డిశ్చార్జ్‌లో కూడా చాలా రకాలు..

White Discharge Problem: వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుందా.. జామాకులతో తగ్గించండి..
White Discharge Problem

Updated on: Mar 20, 2024 | 6:08 PM

చాలా మంది లేడీస్‌లో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే ఉంటారు. ఈ విషయం ఎవరితో చెప్పుకోవాలో తెలీక సతమతమవుతూ ఉంటారు. వైట్ డిశ్చార్జ్ సమస్యను తక్కువ అంచనా వేయకూడదు. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. వైట్ డిశ్చార్జ్ కారణంగా మహిళల్లో నీరసం, అలసట, పలు ఇన్ ఫెక్షన్లు కూడా రావచ్చు. దీన్ని ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే.. దీర్ఘకాలిక వ్యాధులుగా మారవచ్చు. అలాగే వైట్ డిశ్చార్జ్‌లో కూడా చాలా రకాలు ఉంటాయి. వైట్ డిశ్చార్జ్ రంగును బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు. అలాగే సమస్య తీవ్రతను కూడా గుర్తిస్తారు. అయితే ముందుగా కొన్ని హోమ్ రెమిడీస్‌తో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల, పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. వైట్ డిశ్చార్జ్ వల్ల అవుతూ ఉండటం వల్ల.. విపరీతమైన నీరసం, అలసట, బలహీనంగా ఉండటం, తలనొప్పి, మలబద్ధకం, ప్రవైట్ పార్ట్స్ నుంచి వాసన, యోని ప్రాంతంలో దురద వంటివి ఉంటాయి. మరి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్‌ని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

జామాకులు:

వైట్ డిశ్చార్జ్ సమస్యను తగ్గించడానికి జామ ఆకులు కూడా బాగా హెల్ప్ చేస్తాయి. జామ కాయతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. జామ ఆకులతో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా జామ ఆకులను వివిధ అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఉపయోగిస్తారు. జామ ఆకుల్ని బాగా కడిగి.. వాటిని నీటిలో మరిగించి.. చల్లారాక.. రోజుకు రెండు సార్లు తాగుతూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. ఈ ససమ్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

తులసి:

తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్‌ని పీల్చుకుని.. కేవలం ఆక్సిజన్‌ని మాత్రమే తులిసి మొక్క రిలీజ్ చేస్తుంది. తులసి ఆకుల్ని శుభ్రం చేసి మిక్సీలో వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయాలి. అందులో కొద్దిగా తేనె కలిపి.. వారానికి రెండు సార్లు తాగితే.. మంచి ఫలితం ఉంటుంది.

రాతి ఉసిరి:

రాతి ఉసిరిలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే అనేక పోషకాలు కూడా ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరిని పచ్చిగా అయినా.. పొడి రూపంలో లేదా ఇతర ఆహార పదార్థాలతో అయినా కలిపి తీసుకోవచ్చు. రెగ్యులర్‌గా రాతి ఉసిరి తింటే.. ఈ సమస్య పరిష్కారం అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..