Bathing : ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది..? చల్లగా లేదా వేడిగా.. నిపుణుల సూచన ఏంటంటే..!

సాధారణంగా మన మందరం వాతావరణాన్ని బట్టి చల్లని, వేడి నీటితో స్నానం చేస్తుంటాం.. చలికాలంలో వేడినీళ్లతోనూ, వేసవిలో చల్లనీళ్లతోనూ స్నానం చేస్తుంటాం. అయితే స్నానం చేసే నీటికి సంబంధించి నిపుణులు చెబుతున్నారో తెలుసుకోవటం తప్పనిసరి. లేదంటే, ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే సహజ నూనెలు కొన్ని బయటకు వెళ్లిపోతాయని హెచ్చరిస్తున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం...

Bathing : ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది..? చల్లగా లేదా వేడిగా.. నిపుణుల సూచన ఏంటంటే..!
Bathing

Updated on: Jul 12, 2024 | 4:46 PM

శరీరం ఆరోగ్యంగా, తాజాగా ఉండాలంటే స్నానం తప్పనిసరి. తలస్నానం చేయడం వల్ల మనసు రిలాక్స్ అవ్వడమే కాకుండా శరీరం నుండి అలసట కూడా తొలగిపోతుంది. ఇక కొంతమంది ఉదయం స్నానం చేస్తారు. కొందరు రాత్రిపూట స్నానం చేస్తుంటారు. ఇలా చేస్తే నిద్రబాగా పడుతుందని భావిస్తారు. చాలా మంది రోజుకు ఒకసారి స్నానం చేస్తే, కొంతమంది రోజుకు 2-3 సార్లు స్నానం చేస్తుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఉక్కపోత, చెమట కారణంగా ఒకటి కంటే ఎక్కువసార్లు స్నానం చేస్తుంటారు. కానీ, ఇలా చేయటం తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తరచుగా స్నానం, తలస్నానం చేయడం వల్ల శరీరంలో ఉండే సహజ నూనెలు కొన్ని బయటకు వెళ్లిపోతాయని హెచ్చరిస్తున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…

చర్మాన్ని మృదువుగా ఉంచే కొన్ని సహజ నూనెలు మన శరీరంలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మీరు రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు స్నానం చేస్తే ఈ సహజ నూనెలు శరీరం నుండి బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా మీ చర్మం పొడిగా మారుతుంది. అతిగా స్నానం చేయడం వల్ల చర్మంపై దురద కలుగుతుంది. అయితే, వేసవిలో, చర్మం ఎక్కువగా చెమట పట్టినప్పుడు రెండుసార్లు స్నానం చేయవచ్చు. కానీ, సబ్బు లేకుండా చేయాలంటున్నారు. అదే సమయంలో చలికాలంలో వారానికి ఐదుసార్లు స్నానం చేయడం మంచి ఆరోగ్యానికి సరిపోతుందని చెబుతున్నారు.

సాధారణంగా మన మందరం వాతావరణాన్ని బట్టి చల్లని, వేడి నీటితో స్నానం చేస్తుంటాం.. చలికాలంలో వేడినీళ్లతోనూ, వేసవిలో చల్లనీళ్లతోనూ స్నానం చేస్తుంటాం. అయితే స్నానం చేసే నీటి ఉష్ణోగ్రత మరీ వేడిగానూ, చల్లగానూ ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం, చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం సున్నితంగా మారుతుంది. అందువల్ల, అధిక వేడి లేకుండా ఉండే నీటితో స్నానం చేయాలంటున్నారు. అదే సమయంలో వేసవిలో కూడా చల్లటి నీటితో స్నానం చేయకూడదు. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అందువల్ల, వేసవిలోనూ గోరువెచ్చని నీటితో లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన నీటితో స్నానం చేయాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతపై పెద్దగా ప్రభావం ఉండదు. అంతే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ కూడా పెరిగి జలుబు, దగ్గు వంటి వ్యాధులు దరిచేరవు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..