Healthy diet: రాత్రి పూట ఏది తింటే మంచిది.. భోజనమా, చపాతీనా..

ప్రస్తుత జీవనవిధానంలో చాలా మంది అరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ద కనబరుస్తున్నారు...

Healthy diet: రాత్రి పూట ఏది తింటే మంచిది.. భోజనమా, చపాతీనా..
Rice

Updated on: Feb 26, 2022 | 8:21 AM

ప్రస్తుత జీవనవిధానంలో చాలా మంది అరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ద కనబరుస్తున్నారు. ఇందు కోసం రోజు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుని మంచి ఫలితాలను పొందవచ్చు. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించి, ప్రోటీన్ వినియోగాన్ని పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ మన దేశంలో భోజనంలో బియ్యం, చపాతీల రూపంలో పిండి పదార్థాలు నిండిన ఆహరం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అయితే మధ్యాహ్న సమయంలో భోజనంగా రైస్ తీసుకున్నా ఫర్వాలేదు కానీ రాత్రి తీసుకునే ఫుడ్‌లో రైస్ ఉంటే ఏమవుతుందంటే..

అన్నం, చపాతీలలో ఉండే పోషక విలువలలో పెద్దగా తేడా ఉండదు. రెండూ ధాన్యాలను ప్రాసెస్ చేయడం ద్వారా తయారవుతాయి. సోడియం కంటెంట్లో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. చపాతీలతో పోల్చి చూస్తే బియ్యంలో ఫైబర్, ప్రోటీన్స్, కొవ్వులు తక్కువగా.. కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పాలీష్ బియ్యంలో విటమిన్లు తక్కువగా ఉంటున్నాయి. అన్నం తొందరగా జీర్ణమయ్యి ఆకలి వేస్తుంది. కానీ చపాతీ, రోటీలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆలస్యంగా జీర్ణమయ్యి త్వరగా ఆకలి వేయదు.

అందుకే బరువు తగ్గాలని భావించే వాళ్లు భోజనంలో చపాతీని చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో రైస్ బదులు చపాతీ తింటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే చపాతీని పప్పు, కూరగాయలు, పెరుగుతో తీసుకుంటే మరీ మంచిదంటున్నారు. బార్లీ, జొన్న, గోధుమలను కలిపి తయారు చేసిన చపాతీలలో కాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు లభిస్తాయి. అయితే రాత్రి 8 గంటల్లోపే ఆహరం తీసుకుంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి పద్ధతులు/ఆహారం/చిట్కాలు పాటించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోవడం మంచింది.

Read Also.. Health Tips: కోవిడ్ వచ్చిన వారు ఇలా చేయండి.. మీ ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి.. దీంతోపాటు..