Sleep after Dinner: రాత్రి భోజనానికి ఏది సరైన సమయం..? ఆ తర్వాత ఎన్ని గంటలకు నిద్ర పోవాలి..?

|

Nov 29, 2022 | 1:42 PM

మానవ శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి ఆహారం, ఇంకా మంచి జీవనశైలి అత్యవసరం. ప్రస్తుత కాలంలో మానవజీవితం బిజీబిజీగా సాగడంతో చాలామంది లైఫ్‌లో మధ్యాహ్న భోజనానికి కూడా సమయం..

Sleep after Dinner: రాత్రి భోజనానికి ఏది సరైన సమయం..?  ఆ తర్వాత ఎన్ని గంటలకు నిద్ర పోవాలి..?
Dinner And Sleeping
Follow us on

మానవ శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి ఆహారం, ఇంకా మంచి జీవనశైలి అత్యవసరం. ప్రస్తుత కాలంలో మానవజీవితం బిజీబిజీగా సాగడంతో చాలామంది లైఫ్‌లో మధ్యాహ్న భోజనానికి కూడా సమయం దొరకడం లేదు. చాలా మంది పని చేస్తున్నసమయంలో విశ్రాంతి లభించినప్పుడే ఆహారం తింటున్నారు. కానీ సమయానుకూలంగా కాకుండా ఎప్పుడుపడితే అప్పుడు ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. వైద్యుల సూచనల మేరకు ప్రతి వ్యక్తి తాను తీసుకునే అల్పాహారం, భోజనం, రాత్రి భోజనానికి నిర్ధిష్ట సమయాన్ని కలిగి ఉండాలి. ఆహారం తీసుకోవడంలో ఒక షెడ్యూల్‌ను పెట్టుకుని పాటించకపోతే అనేక తీవ్రమైన వ్యాధులు ఎదురయ్యే అవకాశం ఉంది. నిర్దిష్ట సమయం అని ఒక షెడ్యూల్‌ను పెట్టుకుని దానిని  పాటిస్తూ.. సరైన సమయానికి భోజనం చేస్తే శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. తద్వారా మానవ శరీరం చాలా ఫిట్‌గా ఉంటుంది.

మారుతున్న జీవనశైలి కారణంగా, ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు అర్థరాత్రి వరకు పని చేసి ఇంటికి వస్తున్నారు. ఆ తర్వాత రాత్రి భోజనం చేసి వెంటనే లేదా తినకుండానే పడుకుంటారు. తిన్న వెంటనే నిద్రపోవడం మానవ ఆరోగ్యానికి అత్యంత హానికరం. రాత్రి భోజనం చేసాక.. 4 లేదా 5 గంటల తర్వాత నిద్రపోవాలి. అయితే దానికి నిర్ణీత సమయం ఉంటుంది. అందుకు  తినడానికి సరైన సమయం ఏమిటో తెలుసుకుందాం..

రాత్రి భోజనానికి ఇది సరైన సమయం- సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య సమయంలో రాత్రి భోజనం చేయడం మానవ ఆరోగ్యానికి మంచిది. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా  మీరు దానిని ఒక అరగంటకు తగ్గించవచ్చు. వైద్యులు ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత భోజనం తినకూడదు. ఏవైనా కారణాల వల్ల రాత్రి భోజనానికి ఆలస్యం అయితే.. తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తినాలి. కడుపు నిండా తినకూడదు. ఎందుకంటే ఎక్కువగా భోజనం తింటే అది రాత్రి వేళ సరిగ్గా జీర్ణం కాదు. దీని వలన రాత్రిపూట నిద్ర లేకపోవడం, ఆందోళన చెందడం వంటి సమస్యలు కలగవచ్చు. తిన్న వెంటనే నిద్రపోవడం కూడా చెడు అలవాటు. దీంతో మరెన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రాత్రి భోజనం తర్వాత ఎంతసేపు నిద్రించాలి- ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి భోజనం చేసిన తర్వాత 2 నుంచి 3 గంటల వరకు నిద్రపోవాలి. ప్రతి ఒక్కరూ భోజనం చేసిన తర్వాత కనీసం 20 నుంచి 25 నిమిషాలు నడవాలి. తద్వారా ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది ఇంకా నిద్ర బాగా వస్తుంది. అయితే నిజం ఏమిటో మనందరికీ తెలుసు. అందరూ రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతారు. కానీ దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి.

తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల కలిగే ప్రతికూలతలు- మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తి తిన్న వెంటనే నిద్రపోతే, చక్కెర రక్తంలో కరిగిపోతుంది. ఇలా జరగడం చాలా ప్రమాదకరం. ఆహారం తిన్న తర్వాత షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, మధుమేహంతో బాధపడుతున్న రోగులు కొంత సమయం పాటు నడవాలి. తద్వారా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అనవసరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

అసిడిటీ సమస్య- రాత్రి భోజనం తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణక్రియలో సమస్య వస్తుంది. ఇంకా దీని వల్ల జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. కడుపులో ఆమ్లం ఏర్పడటం ప్రారంభమై లోపల మంటగా అనిపిస్తుంది. దీనిని నిరోధించడానికి రాత్రి భోజనం తర్వాత కొంత సమయం నడవడం, కొంత విరామం ఇచ్చి నిద్రపోవడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..