
ఎక్కిళ్లు రావడం సర్వసాధారణమైన విషయం. ప్రతీ ఒక్కరికీ ఈ సమస్య ఏదో ఒక సమయంలో వచ్చే ఉంటుంది. ఎక్కిళ్లు వస్తే మనల్ని ఎవరో గుర్తు చేసుకుంటున్నారని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఎక్కిళ్లు వచ్చిన వెంటనే ఏదైనా షాకింగ్ విషయం చెబితే వెంటనే తగ్గిపోతాయని అంటుంటారు. అయితే సాధారణంగా నీళ్లు తాగగానే ఎక్కిళ్లు వాటంతటవే తగ్గిపోతాయి. అయితే ఇంతకీ ఎక్కిళ్లు రావడానికి అసలు కారణం ఏంటి.? ఇది ఏమైనా అనారోగ్యానికి సంకేతమా.? ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్కిళ్లు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి ఆహారం తీసుకునే సమయంలో గొంతులో ఇరుక్కోవడం. అంతేకాకుండా స్పైసీ ఫుడ్ తీసుకోవడం కూడా ఒక కారణంగా చెబుతుంటారు. నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఎక్కిళ్లు శ్వాసకు సంబంధించిన సమస్యగా చెబుతుంటారు. జీర్ణక్రియ లేదా శ్వాసకోశ వ్యవస్థలో ఏదైనా ఆటంకం ఏర్పడితే. ఎక్కిళ్లు రావడం ప్రారంభమవుతాయి. కడుపు, ఊపిరితిత్తుల మధ్య ఉన్న డయాఫ్రాగమ్‌తో పాటు పక్కటెముకల కండరాలలో సంకోచం కారణంగా ఎక్కిళ్లు ప్రారంభమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా మనం గాలి పీల్చిన సమయంలో డయాఫ్రాగమ్ దానిని కిందికి లాగుతుంది. గాలి బయటకు వదిలినిప్పుడు అది మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంది. డయాఫ్రాగమ్ సంకోచం కారణంగా.. ఊపిరితిత్తులు వేగంగా గాలిని తీసుకోవడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా వ్యక్తి ఎక్కిళ్లు మొదలవుతాయి. ఎక్కిళ్లకు కారణం కూడా పొట్టకు సంబంధించినదే. తక్కువ సమయంలో ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకున్న సమయంలో కూడా ఎక్కిళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..