Ambani: అంబానీ కుటుంబం తాగే పాలు ఎంత ప్రత్యేకమో తెలుసా? ధర తెలిస్తే షాకవుతారు!

|

Sep 16, 2024 | 2:33 PM

ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ చేసే వ్యాపారాల గురించే కాక.. ఆయన కుటుంబానికి సంబంధించి కూడా తరచుగా ఏదో ఒక వార్త వస్తునే ఉంటుంది. అంబానీ ఇంట ఏదైనా శుభకార్యం నిర్వహిస్తే నెట్టింట్లో దాని గురించే వైరల్‌ అవుతుంటుంది. ఇటీవల అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు, పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో అందరికి..

Ambani: అంబానీ కుటుంబం తాగే పాలు ఎంత ప్రత్యేకమో తెలుసా? ధర తెలిస్తే షాకవుతారు!
Mukesh Ambani
Follow us on

ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ చేసే వ్యాపారాల గురించే కాక.. ఆయన కుటుంబానికి సంబంధించి కూడా తరచుగా ఏదో ఒక వార్త వస్తునే ఉంటుంది. అంబానీ ఇంట ఏదైనా శుభకార్యం నిర్వహిస్తే నెట్టింట్లో దాని గురించే వైరల్‌ అవుతుంటుంది. ఇటీవల అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు, పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకునేలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక అప్పుడప్పుడు అంబానీ ఫ్యామిలీలో వాడే వస్తువులు, కార్లు, ఆభరణాల గురించి కూడా వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు కూడా అంబానీ కుటుంబం తాగే పాల గురించి చర్చల్లో వస్తుంది. మరీ ఆ పాల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

ముఖేష్ అంబానీతో సహా అతని కుటుంబం మొత్తం పాలు అయినా స్వచ్ఛమైన ఆహారం తినాలని భావిస్తుంది. అతని ఇంటికి రోజూ తాజా ఆహార పదార్థాలు వస్తుంటాయి. అంబానీ కుటుంబంబానికి కిచెన్‌లో చాలా ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తారు. అయితే వారి ఇంటికి వచ్చే పాలు కూడా చాలా స్పెషల్ అని మీకు తెలుసా..?

ఇది కూడా చదవండి: రైళ్ల మైలేజీ ఎంతో తెలుసా? ఏ ట్రైన్‌ ఎంత ఇస్తుంది?

మీడియా కథనాల ప్రకారం.. ముఖేష్ అంబానీ ప్రత్యేక విదేశీ జాతి చెందిన స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు తాగుతారు. పూణే నుండి అతని ఇంటికి చేరుకుంటుంది. ఈ ఆవు స్విస్ జాతికి చెందినది. దీని పాలు చాలా పోషకమైనవి. వీటిలో ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయట. పూణేలో స్పెషల్ హైటెక్ లెవల్ లో 35 ఎకరాల్లో ఓ డెయిరీ ఫామ్ ఏర్పాటు చేశారు. పూణేకు చెందిన హైటెక్ భాగ్యలక్ష్మి డెయిరీ ఈ జాతి ఆవులను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ 3000 పైగా విదేశీ జాతి ఆవులు ఉన్నాయి.

లక్షల విలువ చేసే ఈ ఆవుల కోసం రబ్బర్ కోటెడ్ పరుపులను కూడా కేరళ నుంచి వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ఆవులు ఆర్‌ఓ (RO) నీటిని తాగుతాయి. ఈ జాతికి చెందిన ఆవు రోజుకు 25 లీటర్ల పాలను ఇస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్లు మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పాల ధర లీటర్‌కు రూ.150కిపైగానే ఉంటుందని తెలుస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, హోల్‌స్టెయిన్-ఫ్రీసియన్ పాలు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన పాల ఉత్పత్తి, ఇది A1, A2 బీటా కేసైన్ (ప్రోటీన్) రెండింటిలోనూ సమృద్ధిగా ఉంటుంది. ఈ పాలు పాడి పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తుంది. ప్రోటీన్లు, స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలు, అవసరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లలో సమృద్ధిగా ఉంటాయి. అయితే పూర్తిగా పెరిగిన హోల్‌స్టెయిన్ ఆవు 680 నుండి 770 కిలోల బరువు ఉంటుందట. ఈ ఆవు రోజుకు 25 లీటర్ల వరకు పాలు ఇస్తుందట.

ఇది కూడా చదవండి:Indian Railways: దేశంలో ఏ రైలు నుంచి అత్యధిక ఆదాయం వస్తుందో తెలుసా?

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి