AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌.. మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఇంత డేంజరా..? శరీరంలో జరిగేది ఇదే..

బంగాళాదుంపల్లో ఉండే సోలనిన్ దీనికి కారణం అవుతుంది. బంగాళాదుంప మొలకెత్తినట్లయితే వాటిని వండితే ఎంతో ప్రమాదం. మొలకెత్తిన లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంచిన బంగాళదుంపలు మనుషులకే కాదు, జంతువుల ఆరోగ్యానికి కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాంటివి వెంటనే పారేయండి.

బాబోయ్‌.. మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఇంత డేంజరా..? శరీరంలో జరిగేది ఇదే..
Sprouted Potatoes
Jyothi Gadda
|

Updated on: Jun 25, 2025 | 11:31 AM

Share

ఒక్కోసారి ఇంటికి తెచ్చిన బంగాళాదుంపలు మొలకెత్తుతాయి. అలా మొలకలు వచ్చిన బంగాళాదుంపలను కూడా ఎంతో మంది వాడుతూ ఉంటారు. మొలకెత్తిన బంగాళాదుంపల్లో సోలనిన్ అనే విష రసాయనాన్ని ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరానికి ప్రమాదకరమైనది. బంగాళాదుంప మొలకలు వస్తే వాటిని తినకపోవడమే ఉత్తమం. మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది తలనొప్పి లేదా మైకము కలిగిస్తుంది. పిల్లలు, వృద్ధులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి, వీరు మొలకలు వచ్చిన బంగాళాదుంపలను తినకూడదు.

మొలకెత్తిన బంగాళదుంపల్లో విటమిన్ సి, విటమిన్ b6, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మాత్రం ఉంటాయి. కానీ సోలనిన్ కూడా అధిక స్థాయిలో ఉంటుంది. సోలోనిన్ అనేది ఒక సహజమైన విష పదార్థం. దీన్ని అధికంగా తింటే వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వంట చేయడానికి మొలకెత్తిన బంగాళదుంపలు మంచిది కాదు. వాటిని పడేయడమే మంచిది. బంగాళాదుంప తినడానికి చేదుగా ఉంటే, అది తినకూడదని అర్థం. వాటిని పడేయడమే మంచిది.

మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల చర్మపు చికాకు లేదా కంటి చికాకు వంటి అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. బంగాళాదుంపల్లో ఉండే సోలనిన్ దీనికి కారణం అవుతుంది. బంగాళాదుంప మొలకెత్తినట్లయితే వాటిని వండితే ఎంతో ప్రమాదం. మొలకెత్తిన లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంచిన బంగాళదుంపలు మనుషులకే కాదు, జంతువుల ఆరోగ్యానికి కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాంటివి వెంటనే పారేయండి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2..
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2..
మాస్ మంత్రం పఠిస్తున్న క్లాస్‌ స్టార్స్‌... రూటెందుకు మారుస్తున్న
మాస్ మంత్రం పఠిస్తున్న క్లాస్‌ స్టార్స్‌... రూటెందుకు మారుస్తున్న
కుండీలు కొనాల్సిన పనిలేదు.. మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు..
కుండీలు కొనాల్సిన పనిలేదు.. మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు..
దేశ ద్రోహానికి పాల్పడ్డడంటూ జో కెంట్‌పై విచారణ..!
దేశ ద్రోహానికి పాల్పడ్డడంటూ జో కెంట్‌పై విచారణ..!
వివాదంలో కేడీ ది డెవిల్ మూవీ.. లేటెస్ట్ సాంగ్‌ మీద విమర్శలు
వివాదంలో కేడీ ది డెవిల్ మూవీ.. లేటెస్ట్ సాంగ్‌ మీద విమర్శలు
మీ ఇంట్లో 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉందా? ఈ నియమాలు తెలుసా?
మీ ఇంట్లో 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉందా? ఈ నియమాలు తెలుసా?
ఎల్లమ్మ నుంచి ఆ హీరోయిన్ కూడా అవుట్.?
ఎల్లమ్మ నుంచి ఆ హీరోయిన్ కూడా అవుట్.?
సమ్మర్‌ సినిమాలే కీలకం..అందాల భామల ఆశలన్నీ వాటి మీదే!
సమ్మర్‌ సినిమాలే కీలకం..అందాల భామల ఆశలన్నీ వాటి మీదే!
జూన్‌ 1 నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభం.. వేసవిసెలవులు ఎప్పట్నుంచంటే
జూన్‌ 1 నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభం.. వేసవిసెలవులు ఎప్పట్నుంచంటే
చైత్ర నవరాత్రి 2026: 3 శుభ యోగాలు.. ఈ రాశులపై అదృష్టం జాక్‌పాట్!
చైత్ర నవరాత్రి 2026: 3 శుభ యోగాలు.. ఈ రాశులపై అదృష్టం జాక్‌పాట్!