Kidney Failure: ఉదయం నిద్ర లేచిన వెంటనే నీరసంగా అనిపిస్తుందా? అయితే మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్లే..

మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా అవసరమైన పోషకాల సమతుల్యతను కూడా కాపాడుతాయి. కానీ కొన్నిసార్లు మూత్రపిండాలు మనకు తెలియకుండానే ఒత్తిడికి లోనవుతాయి. దాని నష్టం లక్షణాలను మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ విధంగా మనం చేసే నిర్లక్ష్యం భవిష్యత్తులో తీవ్ర ప్రమాదకరం కావచ్చు..

Kidney Failure: ఉదయం నిద్ర లేచిన వెంటనే నీరసంగా అనిపిస్తుందా? అయితే మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్లే..
Kidney Failure

Updated on: Jun 05, 2025 | 9:06 PM

మన ఒంట్లో ముఖ్యమైన భాగాల్లో కిడ్నీల పాత్ర ఎంత చెప్పినా తక్కువే. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా అవసరమైన పోషకాల సమతుల్యతను కూడా కాపాడుతాయి. కానీ కొన్నిసార్లు మూత్రపిండాలు మనకు తెలియకుండానే ఒత్తిడికి లోనవుతాయి. దాని నష్టం లక్షణాలను మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ విధంగా మనం చేసే నిర్లక్ష్యం భవిష్యత్తులో తీవ్ర ప్రమాదకరం కావచ్చు. కాబట్టి మన మూత్రపిండాల ఆరోగ్యం గురించి వీలైనంత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మూత్రపిండాలు ఆరోగ్యంగా లేవని ఎలా తెలుసుకోవాలి? దాని లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ముఖం వాపు

మీరు ఉదయం నిద్రలేచినప్పుడు, మీ ముఖం, కళ్ళ చుట్టూ వాపు కనిపించడం, ముఖం ఉబ్బినట్లు ఉంటే.. మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా లేవని సూచిస్తుంది. ఎందుకంటే మూత్రపిండాలు శరీరంలోని సోడియం, ద్రవం సమతుల్యతను నియంత్రిస్తాయి. అవి సరిగ్గా పనిచేయనప్పుడు, కణజాలాలలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది వాపుకు కారణమవుతుంది.

మూత్రం రంగులో మార్పు

ఉదయం మూత్ర విసర్జన చేసినప్పుడు దాని రంగు మారినట్లు, దుర్వాసన వస్తున్నట్లు మీరు గమనించినట్లయితే.. మీ మూత్రపిండాల ఆరోగ్యంలో సమస్య ఉందని అర్ధం చేసుకోవాలి. సాధారణంగా మూత్రపిండాలు వ్యర్థాలను విసర్జించినప్పుడు, అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లను కూడా నిలుపుకుంటాయి. కానీ అవి సరిగ్గా పనిచేయనప్పుడు, ప్రోటీన్ బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఇది ఈ సమస్యకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉదయం నిద్ర లేచిన వెంటనే అలసిపోయినట్లు అనిపించడం

సాధారణంగా మనం ఉదయం నిద్ర లేచినప్పుడు తాజాగా ఉండాలి. కానీ కొంత మందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఇది మూత్రపిండాలు ఆరోగ్యంగా లేవని సూచిక. సాధారణంగా మన మూత్రపిండాలు శరీరం నుంచి విషాన్ని తొలగిస్తాయి. కానీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు, ఈ విషపదార్థాలు రక్తంలో పేరుకుపోవడం ప్రారంభిస్తాయి. ఇది అలసటకు దారితీస్తుంది.

మూత్రంలో రక్తం

మూత్ర విసర్జన చేసేటప్పుడు రక్తం కనిపించడం కూడా మరోక లక్షణం. ఈ రకమైన సమస్య మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ వల్ల సంభవించవచ్చు. అయితే మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి లేకుండా రక్తం వెళితే, అది మూత్రపిండ కణ క్యాన్సర్ లేదా మూత్రాశయ క్యాన్సర్ వంటి తీవ్రమైన పరిస్థితికి సంకేతం.

పొడి చర్మం, దురద

మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు, శరీరంలో చర్మ సమస్యలు కనిపించవచ్చు. చర్మం పొడిగా లేదా దురదగా మారుతుంది. ఈ సమస్య ఉదయం పూట ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మన మూత్రపిండాల పనితీరు బలహీనపడినప్పుడు, శరీరంలోని ఈ రెండు మూలకాల సమతుల్యత చెదిరిపోతుంది. అందువలన ఈ రకమైన సమస్య కనిపిస్తుంది.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.