
వర్షాకాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా వేడి వేడి ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనికి విరుద్ధంగా చల్లని ఆహారాలు తీసుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా, వర్షాకాలం, చలికాలంలో ఐస్ క్రీం వంటి ఆహారాలు తినడం వల్ల జలుబు, దగ్గు, ఛాతీ బిగుతుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. అంతే కాదు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకు కూడా కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.
ఐస్ క్రీంలో చక్కెర, కేలరీలు, అనవసరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని అంటున్నారు. శీతాకాలం, వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని చెప్పారు.. ఇది డయాబెటిస్‌కు కూడా దారితీస్తుందని అంటున్నారు.
అలాగే వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. గొంతు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతే కాదు, వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం వల్ల మెదడులోని నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తలనొప్పి, దంత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. ఐస్ క్రీం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల ఊబకాయం కూడా వస్తుంది. కాబట్టి, ఐస్ క్రీం అంటే మీకు ఎంత ఇష్టం ఉన్నప్పటికీ వర్షాకాలంలో ఐస్ క్రీం తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..