వారెవ్వా.. పోషకాల నిధి కాబూలీ శనగలు తింటే ఇన్ని లాభాలున్నాయా..? వెంటనే మొదలు పెట్టేయండి మరీ..!

|

Dec 31, 2024 | 8:43 PM

ఇప్పటికే ప్రోటీన్‌ సమస్యలతో బాధపడేవారు తెల్ల శనగలను తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తెల్ల శనగలను అల్పాహారంలో తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్త పోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

వారెవ్వా.. పోషకాల నిధి కాబూలీ శనగలు తింటే ఇన్ని లాభాలున్నాయా..? వెంటనే మొదలు పెట్టేయండి మరీ..!
Kabuli Chana
Follow us on

కాబూలీ శనగలు.. సాధారణంగా చోలీ కర్రీకి వీటిని ఎక్కవగా వినియోగిస్తుంటారు. వీటినే తెల్ల శనగలు అని కూడా అంటారు. వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఊహించని లాభాలు పొందుతారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్‌ శాతం అధికంగా ఉంటుంది. ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. కాబూలి శనగలతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…

కాబూలి శనగలతో షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. వీటిలో విటమిన్ బి9, మెగ్నీషియం, జింక్ తదితర పోషకాలుంటాయి. దీంతో త్వరగా అలసట రాదు. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్‌ని కలిగి ఉంటాయి. కాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇది ఒక యాంటి ఆక్సిడెంట్‌, ఎనర్జీని బూస్ట్ చేస్తుంది.

తెల్ల శనగలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రక్త హీనతను తగ్గిస్తుంది. ఇప్పటికే ప్రోటీన్‌ సమస్యలతో బాధపడేవారు తెల్ల శనగలను తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తెల్ల శనగలను అల్పాహారంలో తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్త పోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..