Weight Loss: పొట్ట తగ్గి స్మార్ట్‌గా అవ్వాలనుకుంటున్నారా..? పరగడుపున జస్ట్ ఈ డ్రింక్ తాగండి చాలు..

|

Aug 27, 2022 | 7:06 AM

వర్క్ ఫ్రమ్ హోమ్, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం లాంటి వాటితో ఊబకాయం సమస్య మరింత పెరుగుతోంది. స్థూలకాయం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి.

Weight Loss: పొట్ట తగ్గి స్మార్ట్‌గా అవ్వాలనుకుంటున్నారా..? పరగడుపున జస్ట్ ఈ డ్రింక్ తాగండి చాలు..
Weight Loss
Follow us on

Ginger And Lemon Juice For Weight Loss: ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం లాంటి వాటితో ఊబకాయం సమస్య మరింత పెరుగుతోంది. స్థూలకాయం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు తక్కువ వయస్సులో కూడా వస్తున్నాయి. అందుకే అందరూ ఫిట్‌గా ఉండేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. అయితే త్వరగా బరువు తగ్గాలంటే నిమ్మ, అల్లం రసాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. నిమ్మకాయ, అల్లం మీ పొట్ట కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఈ మిశ్రమాన్ని రోజూ తీసుకుంటే అనేక సమస్యల నుంచి బయటపడొచ్చు. పరగడుపున అల్లం, నిమ్మరసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లం – నిమ్మరసం ప్రయోజనాలు..

బొడ్డు కొవ్వును తగ్గిస్తుంది: బొడ్డు కొవ్వును తగ్గించడానికి అల్లం, నిమ్మరసం తీసుకోవచ్చు. విటమిన్ సి, ఇతర పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి బెల్లి ఫ్యాట్‌ను తగ్గించడం ద్వారా బరువును సమతుల్యం చేస్తుంది. అదనంగా ఇది కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే.. గుండె సమస్యలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది: జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే ప్రతిరోజూ నిమ్మ, అల్లం రసాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ ఇతర పోషకాలు జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఈ మిశ్రమం ఆహారాన్ని బాగా జీర్ణం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది.

శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది: అల్లం, నిమ్మకాయలో అనేక రకాల గుణాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి శరీరాన్ని డిటాక్సిఫై చేసి కొవ్వును తగ్గిస్తుంది. అంతే కాదు దీన్ని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

ఇందుకోసం, కొంచెం అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని.. నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం ఈ నీటిలో నిమ్మరం వేసుకొని తాగాలి. ఇలా దీనిని రోజుకు రెండు సార్లు తాగవచ్చు. రుచికోసం ఈ మిశ్రమంలో తేనె కూడా కలుపుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..