Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? పరగడుపున ఈ డ్రింక్స్ తాగితే కొవ్వు ఇట్టే కరుగుతుంది

|

Apr 21, 2022 | 2:10 PM

Weight Loss Drinks: మారిన ఆహారపు అలవాట్లతో బరువు పెరిగిపోవడం నేడు తీవ్ర విపత్కర సమస్యగా మారింది. అయితే పెరిగిన బరువును తగ్గించుకోవడం అంత తేలికైన పని కాదు.

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? పరగడుపున ఈ డ్రింక్స్ తాగితే కొవ్వు ఇట్టే కరుగుతుంది
Weight Loss Drinks
Follow us on

Weight Loss Drinks: మారిన ఆహారపు అలవాట్లతో బరువు పెరిగిపోవడం నేడు తీవ్ర విపత్కర సమస్యగా మారింది. అయితే పెరిగిన బరువును తగ్గించుకోవడం అంత తేలికైన పని కాదు. దీని కోసం ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో పాటు నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం అవసరం. బరువు తగ్గేందుకు ఘనాహారంతో పాటు ద్రవాహారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పానీయాలను డైట్ లో చేర్చుకోవడం ద్వారా వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంది. అవి శరీరంలోని అదనపు కొవ్వును తొలగిస్తాయి. దీంతో అనేక రోగాలు దూరమవుతాయి. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడే డ్రింక్స్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్ సైడర్ వెనిగర్: బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది పొట్టలోని పీహెచ్ స్థాయిని కంట్రోల్ లో ఉంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది.ముందుగా వెచ్చని నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. దీనికి నిమ్మరసం కలపాలి.

వాము నీరు: వాము నీరు పొట్టకు చాలా మేలు చేస్తుంది. ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు క్రమం తప్పకుండా వాము నీటిని తీసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో వాము వేసి ఉడకించడం ద్వారా ఈ పానీయాన్ని తయారుచేసుకోవచ్చు. దాల్చిన చెక్క శరీర జీవక్రియకు చాలా మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

గ్రీన్ టీ: గ్రీన్ టీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.

పైనాపిల్ జ్యూస్: పైనాపిల్ జ్యూస్ కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీలకర్ర నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

జీలకర్ర నీరు: జీలకర్రను ఓ గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్ని ఆ నీటిని తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

(ఈ కథనంలో అందించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. TV9 తెలుగు వీటిని ధృవీకరించడంలేదు. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ విధానాలను అనుసరించండి.)

Also Read:

Bone Health: కీళ్ల నొప్పితో బాధపడుతున్నారా? ఈ పండ్లు తిన్నారంటే మీ ఎముకలు పుష్టిగా..