Weight Loss: కాబూలి శనగలతో కలలో కూడా ఊహించని లాభాలు.. 12 రోజుల్లోనే మీ నడుము సైజ్‌ జీరో..!

|

Feb 27, 2023 | 6:40 PM

రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపించినా తినవచ్చు. వీటిని నీటిలో నానబెట్టి, ఉడకబెట్టుకుని తినడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.

Weight Loss: కాబూలి శనగలతో కలలో కూడా ఊహించని లాభాలు.. 12 రోజుల్లోనే మీ నడుము సైజ్‌ జీరో..!
Weight Loss
Follow us on

నేటి జీవనశైలి కారణంగా బరువు పెరగడం అనేది సాధారణ సమస్యగా మారింది. బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రజలు రకరకాల ఉపాయాలు పాటిస్తుంటారు. బరువు తగ్గడం కోసం చాలా మంది గంటల తరబడి జిమ్‌లో చెమటలు పట్టిస్తారు. మీరు కూడా మీ శరీర బరువును నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా..? అయితే, మీరు తినే ఆహారంలో తెల్ల శనగలను చేర్చుకోండి. దీనిని వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే బరువు తగ్గడానికి తెల్ల శనగలను ఎలా ఉపయోగపడతాయి..? ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

తెల్ల శనగలలో ఉండే పోషకాలు:
పోషకాహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. 28 గ్రాముల తెల్ల శనగలలో 102 కేలరీలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో 40 శాతం ఫైబర్, 70 శాతం ఫోలేట్, 22 శాతం ఐరన్ ఉంటుంది. కాబట్టి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. దీంతో సులభంగా శరీర బరువు తగ్గుతారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్త పోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
తెల్ల శనగలలో పీచు, ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల సులభంగా 25 శాతం శరీర బరువును నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

తెల్ల శనగలతో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి:
ఇప్పటికే ప్రోటీన్‌ సమస్యలతో బాధపడేవారు తెల్ల శనగలను తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో శరీర ప్రోటీన్లను తగ్గించే చాలా రకాల గుణాలు ఉన్నాయి. కాబట్టి దీని వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయి.

తెల్ల శనగలు తినడానికి సరైన సమయం:
తెల్ల శనగలను అల్పాహారంలో తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపించినా తినవచ్చు. వీటిని నీటిలో నానబెట్టి, ఉడకబెట్టుకుని తినడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..