భారత్‌లో బంగారం ప్రియులు చాలా ఎక్కువ..మన దేశంలో అతిపెద్ద బంగారం మార్కెట్ ఉంది. బంగారాన్ని భారతదేశంలో సంపదకు చిహ్నంగా మాత్రమే ధరిస్తారు. భారతీయులు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. భారతీయ సంస్కృతిలో ఆభరణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆభరణాలు ధరించడం సాంప్రదాయంగా భావిస్తారు. చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు, నడుము, ఇతర శరీర భాగాలను ఆభరణాలతో అలంకరిస్తారు. ఇందుకోసం బంగారం, వెండి, వజ్రం వంటి అనేక లోహ ఆభరణాలను ఉపయోగిస్తారు. అయితే, ఇది కేవలం అందం, హోదా కోసం కాకుండా శాస్త్రీయంగా కూడా బంగారం ధరించడం లాభాదాయకం అంటున్నారు నిపుణులు. జ్యోతిష్య శాస్త్రంలో బంగారానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే, చిన్నప్పుడే పిల్లలకు చెవులు కుట్టించటం ఆనవాయితీ. చెవులకు బంగారు ఆభరణాలు పెడుతుంటారు. కొందరు మగపిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే, అబ్బాయిలు పెద్దయ్యాక దాన్ని తీసేస్తే, అమ్మాయిలు మాత్రం చెవి కమ్మలను ఎప్పుడూ పెట్టుకుంటూనే ఉంటారు. ఇది స్త్రీల అందాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే, చెవులకు పెట్టుకునే ఆభరణాలతో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు వ్యక్తి శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తాయి. గ్రహాలు బలహీనంగా ఉంటే మన జీవితంలో సమస్యలు వస్తాయి. మన చెవి బుధ గ్రహానికి సంబంధించినది. మన చెవిలో ఏ సమస్య వచ్చినా మన జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నాడని సూచిస్తుంది.
అంతేకాదు రాహువు కూడా చెడు స్థానంలో ఉంటే అది మన చెవి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇక్కడ కేతువు కూడా ముఖ్యుడు అవుతాడు. జాతకంలో కేతువు సరిగ్గా లేకుంటే రోగాలు మనల్ని ముంచెత్తుతాయి. ఒక వ్యక్తి జాతకంలో కేతువు, రాహువు రెండూ కలిసి ఉంటే, చెవి సమస్య పెరుగుతుంది. చెవి వ్యాధి మిమ్మల్ని అంటుకుంటుంది. బుధుడు, రాహువు ప్రభావం ఉన్నప్పటికీ, చెవి వ్యాధి మిమ్మల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
బుధుడు బలంగా మారుతాడు: బంగారాన్ని ధరించడం వల్ల జాతకంలో బుధుని స్థానం మెరుగుపడుతుంది. రాహువు చెడు ప్రభావం కూడా ముగుస్తుంది.
బృహస్పతి దీవెనలు : బృహస్పతిని బలోపేతం చేయడానికి బంగారం పనిచేస్తుంది. చెవులకు బంగారు ఆభరణాలు ధరిస్తే గురువు అనుగ్రహం లభిస్తుంది. బుధుడు, గురు గ్రహాల కలయిక మంచి ప్రయోజనాలను ఇస్తుంది.
చెవి ఆరోగ్యం: చెవులకు బంగారు నగలు పెట్టుకుంటే చెవికి సంబంధించిన ఎలాంటి రోగాలు దరిచేరవు. చెవి వ్యాధి తగ్గడంతో పాటు వినికిడి సామర్థ్యం మెరుగుపడుతుంది.
మెదడుకు పదును పెట్టడం (బ్రెయిన్):
చెవులకు బంగారాన్ని ధరించడం వల్ల బుద్ధి పదునుగా మారుతుంది. చెవులు కుట్టించటం వల్ల మెదడు శక్తి పెరుగుతుంది. బంగారం ధరించడం వల్ల బలం కూడా పెరుగుతుంది. చెవులకు బంగారాన్ని ధరించడం వల్ల ఒత్తిడి సమస్య తొలగిపోతుంది. అలాగే బ్రెయిన్ పవర్ త్వరగా రావాలంటే బంగారు ఆభరణాలు ధరించాలి.
చెవులకు బంగారాన్ని ధరించడం వల్ల శాస్త్రోక్తమైన ప్రయోజనాలు:
చెవులకు బంగారం పెట్టుకోవడం వల్ల పక్షవాతం, హెర్నియా వంటి తీవ్రమైన వ్యాధులు దరిచేరవు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..