
మన హిందూ సంప్రదాయంలో అమ్మాయి పుడితే మొదట చెవికి బంగారు పోగులు కుట్టిస్తారు. అంతేకాదు ఏ చిన్న సందర్భం వచ్చినా.. ఇంట్లో అమ్మాయి ఉంది అంటూ బంగారం కొనడానికి ఆసక్తిని చూపిస్తారు. అంతగా భారతీయుల జీవితంలో బంగారంతో ముడిపడిపోయింది. నేటి యువత ఫ్యాషన్ పేరుతో రకరకాల ఆభరణాలను పెట్టుకుంటున్నారు. అయితే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వంటి సమయంలో మాత్రం బంగారు ఆభరణాలకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకనే బంగారం ఖరీదైనది అయినప్పటికీ.. డిమాండ్ తగ్గలేదు. బంగారం కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపే అమ్మాయిలు వివిధ డిజైన్ల ఆభరణాలను సేకరిస్తారు. బంగారం ప్రతిష్టకు చిహ్నం. అయితే బంగారం నగలలో చెవి పోగులకు ప్రత్యేక స్థానం ఉంది. బంగారు చెవిపోగులు ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి . అవును బంగారు చెవిపోగులు ఇష్టపడని వారు దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే చెవిపోగులు ధరించకుండా ఉండలేరు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)