Watermelon Farming: పుచ్చ సాగుతో వేసవిలో కాసుల పంట.. దిగుబడి పెరగాలంటే ఈ పద్దతులు పాటించండి

|

Mar 13, 2022 | 11:36 AM

Watermelon Farming: అన్నదాత అదృష్టాన్ని ప్రకృతి నిర్ణయిస్తుంది. పంటలు చేతికి వచ్చే సమయంలో ఒకొక్కసారి అతివృష్టి, మరొకసారి అనావృష్టితో రైతు కంట కన్నీరు పెట్టిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్‌(Kharif), ప్రస్తుతం రబీ(Rabi)..

Watermelon Farming: పుచ్చ సాగుతో వేసవిలో కాసుల పంట.. దిగుబడి పెరగాలంటే ఈ పద్దతులు పాటించండి
Watermelon Farming
Follow us on

Watermelon Farming: అన్నదాత అదృష్టాన్ని ప్రకృతి నిర్ణయిస్తుంది. పంటలు చేతికి వచ్చే సమయంలో ఒకొక్కసారి అతివృష్టి, మరొకసారి అనావృష్టితో రైతు కంట కన్నీరు పెట్టిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్‌(Kharif), ప్రస్తుతం రబీ(Rabi) సీజన్‌లో ప్రకృతి వైపరీత్యాలతో పండ్లతోటల పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పుచ్చకాయ సాగుచేసిన రైతులు గత రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మార్కెట్‌ పడిపోయింది.. భారీ నష్టాలను పుచ్చకాయ రైతులు చవిచూశారు. అయితే ఈ సారి పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. మార్కెట్ లో పుచ్చకాయ  ధరలు పెరుగుతున్నాయి. వేసవి రావడంతో పుచ్చకాయకు మాంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ ఏడాదైనా రైతులకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం పుచ్చకాయ ధర కిలో రూ.8 నుంచి రూ.11 వరకు పలుకుతోంది. ఇది మరింత పెరగవచ్చని అంచనా.  కరోనా తగ్గుముఖం పట్టడంతో.. ఈ ఏడాది మార్కెట్‌ మూతపడే పరిస్థితి లేదు. దీంతో ఈ ఏడాది రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను డిమాండ్ పెరుగుతుంది. వాతావరణం బాగుంది కనుక దిగుబడి కూడా పెరుగుతుందని అన్నారు.

వ్యవసాయ శాస్త్రవేత్తల సలహా:  పుచ్చకాయ సీజనల్ పంట అని.. విత్తు నాటిన రెండున్నర నెలల్లోనే పంటను ఇస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్త రామేశ్వర్ చందక్ రైతులకు సలహా ఇస్తున్నారు. అంటే పుచ్చకాయ పంటతో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు. అయితే ఇదంతా  రైతుల శ్రమపైనే ఆధారపడి ఉంటుంది. తక్కువ కాలంలో పంట చేతికి రావాలంటే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అప్పుడు పుచ్చకాయల ఉత్పత్తి పెరిగి రైతులకు కూడా మేలు జరుగుతుంది. మహారాష్ట్రలో పుచ్చకాయ ఉత్పత్తిలో ఎక్కువ భాగం ఖాందేష్ ప్రాంతానిదని చెప్పారు.

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పుచ్చకాయ సీజనల్ పంట. అయితే పంట నాటడానికి ముందు.. పుష్పించే కాలంలో సరిగ్గా చూసుకుంటే.. మంచి ఉత్పత్తిని ఇస్తుంది. పుచ్చకాయ పంట కోసం విత్తనాలు విత్తడం కంటే నర్సరీ నుంచి నేరుగా మొక్కలు తెచ్చి సాగు చేస్తే మేలు జరుగుతుంది. పంటను వేయడానికి ముందు సరైన రకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. పుచ్చకాయలో నల్ల ఆకు, ఆకుపచ్చ ఆకులు అంటూ వివిధ రకాలు ఉన్నాయి. వ్యవసాయ భూమిని బట్టి పుచ్చకాయలోని రకాన్ని ఎంచుకోవాలి. పంట మంచిగా చేతిరావాలంటే..పుచ్చ పాదులకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించాలని వ్యవసాయ శాస్త్రవేత్త రామేశ్వర్ చందక్ చెప్పారు.

సాగు చేయడానికి సరైన సమయం: పుచ్చకాయ సీజనల్ పండు. అందుకనే రైతులు పుచ్చకాయ పంట ఉత్పత్తిని పెంచేందుకు సరైన సీజన్‌ను ఎంచుకుంటారు. సరైన సమయం చూసుకోవాలి. ముఖ్యంగా డిసెంబర్ నుంచి దీని దశల్లో సాగు మొదలు పెడతారు. మేలు రకాల విత్తనాలు దిగుబడి అధికంగా ఇస్తాయి. దేశంలో మహారాష్ట్రలోని ఖండేష్ ప్రాంతంలో పుచ్చకాయను ఎక్కువగా పండిస్తారు.

Also Read:

Flipkart: స్మార్ట్‌ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా.? ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు..

Kandikonda: నేడు మహాప్రస్థానంలో కందికొండ అంత్యక్రియలు.. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటన్న మంత్రి తలసాని

Naga Babu: ఇకపై నా పూర్తి సమయాన్ని అందుకే వినియోగిస్తాను.. నెట్టింట్లో వైరలవుతోన్న నాగబాబు పోస్ట్‌..