మీ ముఖం మెరిసిపోవాలా? రాత్రి పడుకునే ముందు ఈ 3 పనులు చేస్తే చాలు!

శీతాకాలంలో చాలా మంది చర్మ సమస్యలను ఎదుర్కోవడం సాధారణమే. చలి గాలుల కారణంగా చర్మం పొడిబారి పోతుంది. కాళ్లు, చేతులలో పగుళ్లు కూడా ఏర్పడతాయి. ఇక, ముఖంపైనా ఈ చలి గాలుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ముఖంపై చర్మం నిర్జీవంగా మారుతుంది. అయితే, పలు జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేసుకోవచ్చు.

మీ ముఖం మెరిసిపోవాలా? రాత్రి పడుకునే ముందు ఈ 3 పనులు చేస్తే చాలు!
Face Glow

Updated on: Dec 29, 2025 | 4:27 PM

శీతాకాలంలో మానవ శరీరంలో ఎక్కువగా ప్రభావితమయ్యేది చర్మమే. చల్లని, పొడి గాలి చర్మాన్ని నిర్జీవంగా చేస్తుంది. చేతులు, కాళ్లు, ముఖం మీద చర్మం పొడిబారి పోతుంది. కాళ్లు, చేతుల్లో పగుళ్లు ఏర్పడతాయి. చల్లని గాలి కారణంగా ఇదంతా జరుగుతుంది. చాలా మందికి పెదవులపై చర్మం పొట్టులా వస్తుంది. అందుకే ఈ కాలంలో ప్రత్యేక చర్మ సంరక్షణ అవసరం. అయితే, చాలా మందికి బహుళ చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం కుదరదు. కొందరికి సమయం ఉండదు. అయినప్పటికీ చర్మ సంరక్షణ కూరుకువారు మాత్రం ఈ పనులు చేయాల్సిందే.

శీతాకాలంలో కూడా మీ చర్మం ఆరోగ్యంగా, మృదువుగా ఉండేందుకు మీరు ప్రతి రాత్రి పడుకునేముందు ఈ మూడు పనులు చేస్తే సరిపోతుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. స్నానం చేయడానికి అధిక నీరు ఉపయోగించకూడదు. వాల్నట్స్, బాదం వంటి కొన్ని డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి ఉదయం తినాలి. ఇవి మంచి కొవ్వులు, విటమిన్-Eని అందిస్తాయి. లోపలి నుంచి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది.

డబుల్ క్లెన్సింగ్

రోజూ సాయంత్రం మీ దినచర్యలో రెండుసార్లు ముఖాన్ని శుభ్రపర్చుకోవాలి. సాధారణ నీటితో ఒకసారి ముఖాన్ని కడుకున్న తర్వాత, పచ్చిపాలలో ముంచిన కాటన్ బాల్‌తో మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇది తేమను అందిస్తుంది. పాలలోని లాక్టోస్ మీ చర్మాన్ని రిలీఫ్‌గా ఉంచుతుంది. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం.

వీటితో స్కిన్ టోన్ చేయండి

మీ చర్మాన్ని ప్రతిరోజూ టోన్ చేసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాలంలో రోజ్ వాటర్, గ్రీన్ టీ ఇందుకు ఉత్తమం. గ్రీన్ టీని మరిగించి వడకట్టి, సమాన మొత్తంలో రోజ్ వాటర్ వేసి, స్ప్రే బాటిల్‌లో నింపండి. శుభ్రం చేసుకున్న తర్వాత మీ ముఖంపై స్ప్రే చేసుకోండి. ఇది మీ చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. కాలుష్యం, ఎండ, దుమ్ముధూళి వల్ల కలిగే ప్రభావాన్ని నివారిస్తుంది.

బాదం నూనె

శీతాకాలంలో చర్మాన్ని శుభ్రపర్చడం, టోనింగ్ చేయడంతోపాటు మాయిశ్చరైజర్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఇందుకు ఉత్తమ మార్గం బాదం నూనెను ఉపయోగించాలి. ఇది విటమిన్-ఇ తోపాటు చర్మాన్ని తేమగా ఉంచే మంచి కొవ్వులను కలిగి ఉంటుంది. ఇది ముఖ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. బాదం నూనెను మీ ముఖానికి అప్లై చేసి వృత్తాకార కదలికలలో మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను పెంచడంతోపాటు చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.